మహబూబాబాద్ లో విషాదం... లోన్ యాప్ వేధింపులకు నిరుపేద స్టూడెంట్ బలి

Published : Jul 11, 2023, 10:05 AM ISTUpdated : Jul 11, 2023, 10:07 AM IST
మహబూబాబాద్ లో విషాదం... లోన్ యాప్ వేధింపులకు నిరుపేద స్టూడెంట్ బలి

సారాంశం

ఆన్ లైన్ లోన్ యాప్ వేధింపులు భరించలేకపోయిన ఓ నిరుపేద కుటుంబానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన మహబూబాబాద్ లో చోటుచేసుకుంది. 

హైదరాబాద్ : ఆన్ లైన్ లోన్ యాప్స్ ఆగడాలు మరీ మితిమీరిపోతున్నాయి. వద్దంటున్నా వెంటపడిమరీ రుణాలిస్తారు... సమయానికి తిరిగి చెల్లించకుంటే వేధింపులకు పాల్పడుతూ ప్రాణాలమీదకు తెస్తుంటారు. ఇలా ఇప్పటికే అనేకమందిని ఈ ఆన్ లైన్ యాప్స్ పొట్టనపెట్టుకున్నాయి. తాజాగా మరో యువకుడు కూడా ఈ లోన్ యాప్ నిర్వహకుల వేధింపులకు బలయ్యాడు. కేవలం రూ.30వేల రుణం కోసం ఇంజనీరింగ్ చదివుతున్న స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు. 

వివరాల్లోకి వెళితే...మహబూబాబాద్ నెల్లికుదురు మండలం కొండెంగలగుట్ట తండాకు చెందిన బానోతు ఆకాశ్(22) హైదారాబాద్ లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. నిరుపేద కుటుంబానికి చెందిన అతడిని తల్లిదండ్రులు అచ్చాలి, కస్సా ఎంతో కష్టపడి చదివిస్తున్నారు. కొడుకు జీవితం బాగుండాలని హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంజనీరింగ్ చేయిస్తున్నారు. 

అయితే కొద్దినెలల కింద ఆకాశ్ ఓ ఆన్ లైన్ లోన్ యాప్ నుండి రూ.30వేలు తీసుకున్నాడు. నిర్ణీత సమయానికి తిరిగి చెల్లించలేకపోవడంతో లోన్ యాప్ సిబ్బంది వేధించడం ప్రారంభించారు. కంగారుపడిపోయిన ఆకాశ్ తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. కానీ వారివద్ద కూడా డబ్బులు లేకపోవడంతో పొదుపు సంఘంలో రుణం తీసుకుని తిరిగి చెల్లిద్దామని చెప్పారు. కానీ అందుకోసం కొద్దిరోజులు ఆగాల్సి వుంటుందని తెలిపారు. 

Read More  స్కూల్ నుంచి తీసుకెళ్లి, గొంతు నులిమి.. పిల్లల్ని కడతేర్చిన కన్నతండ్రి.. దుప్పట్లో చుట్టి, పరార్....

అయితే వెంటనే డబ్బులు తిరిగి చెల్లించాలని లోన్ యాప్ నిర్వహకులు ఆకాశ్ పై తీవ్ర ఒత్తిడి చేసారు. దీంతో ఆదివారం హైదరాబాద్ నుండి స్వగ్రామానికి వెళ్లాడు ఆకాశ్. రాత్రి తల్లిదండ్రులతో కలిసి భోజనం చేసిన తర్వాత కొద్దిసేపు వారితో మాట్లాడి పడుకున్నాడు. అందరూ పడుకున్న తర్వాత అర్ధరాత్రి ఇంట్లోనే తల్లి చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లిదండ్రులు లేచిచూసేసరికి కొడుకు ఉరికి వేలాడుతూ కనిపించాడు. అతడిని కిందకు దించగా అప్పటికే మృతిచెందాడు. 

ఆకాశ్ మృతదేహాన్ని పట్టుకుని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆకాశ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తల్లిదండ్రుల నుండి వివరాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 
 

PREV
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్