ప్రధానితో సీఎం కేసీఆర్ భేటీ

Published : Nov 19, 2016, 11:27 AM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
ప్రధానితో సీఎం కేసీఆర్ భేటీ

సారాంశం

పెద్ద నోట్ల రద్దుపై ప్రధానంగా చర్చ విభజన సమస్యల పరిష్కారానికి వినతి

తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్ రావు సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీ తో సమావేశమయ్యారు. పది నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో ప్రదానంగా పెద్ద నోట్ల రద్దుపై సామాన్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రధాని దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిసింది.

 

నోట్ల రద్దు వల్ల గ్రామీణ ప్రజలు, రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వివరించినట్లు సమాచారం. అలాగే, కేంద్రం ఆకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రంలో ఆదాయం భారీగా తగ్గిన అంశాన్ని, లోటును పూడ్చేందుకు కేంద్రం ఆర్థిక సాయం అందించాలని కోరినట్లు తెలిసింది.

 

అలాగే, సహకార బ్యాంకులకు నోట్ల మార్పిడిపై అవకాశం ఇవ్వకుండా ఆర్ బి ఐ తీసుకున్న నిర్ణయం  వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రధాని దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిసింది.

PREV
click me!

Recommended Stories

Cold Free Winter: ఈసారి చలి లేనట్టే.. శీతాకాలంలో పెరగనున్న ఉష్ణోగ్రతలు.. ఎందుకిలా?
PM Kisan 24th Installment: రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ 24వ విడత డబ్బులు ఖాతాలోకి ఎప్పుడంటే?