జైట్లీ కరుణించేనా...?

First Published Dec 8, 2016, 1:21 PM IST
Highlights
  • కేంద్ర ఆర్థికమంత్రితో కేసీఆర్ భేటీ
  • నోట్ల రద్దు సమస్యలపై చర్చ

 

పెద్ద నోట్లు రద్దై నెల రోజులు దాటిన జనాల కష్టాలు మాత్రం తీరడం లేదు. తెలంగాణ లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. సరిపడా బ్యాంకులు లేవు... ఉన్న ఏటీఎంలు పనిచేయడం లేదు.

 

దీంతో ప్రజల నుంచి నోట్ల రద్దు పై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. నిన్నటి వరకు మోదీ నిర్ణయాన్ని స్వాగతించిన కేసీఆర్ కూడా ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతపై దృష్టి సారించారు.

 

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో గురువారం సీఎం కేసీఆర్ ఈ విషయమై భేటీ అయ్యారు.

500, 1000 నోట్ల రద్దు సమస్యను అధిగమించేందుకు చేపట్టే చర్యలపై చర్చించారు.

 

అలాగే, రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్దికి నిధుల అందజేడయంపై కూడా ఈ భేటీలో సీఎం ప్రస్తావించినట్లు సమాచారం.

 

కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కూడా జైట్లీని అడిగినట్లు సమాచారం

click me!