వేతన పెంపు: ఫిట్‌మెంట్‌పై కేసీఆర్ సర్కార్‌ తుది నిర్ణయమేంటీ..?

Siva Kodati |  
Published : Jan 14, 2021, 05:32 PM ISTUpdated : Jan 14, 2021, 05:36 PM IST
వేతన పెంపు: ఫిట్‌మెంట్‌పై కేసీఆర్ సర్కార్‌ తుది నిర్ణయమేంటీ..?

సారాంశం

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెలాఖరు నాటికి వేతనాలు పెంచుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఉద్యోగులు ఫిట్‌మెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోన్నారు

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెలాఖరు నాటికి వేతనాలు పెంచుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఉద్యోగులు ఫిట్‌మెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోన్నారు.

కానీ ఫిట్ మెంట్ అంశం ఇంకా ఎటూ తేలకపోవడంతో ఆయా వర్గాల్లో ఆందోళన నెలకొంది. అయితే ప్రభుత్వం 30 శాతం ఫిట్​మెంట్​​ అందించేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.

కరోనా నేపథ్యంలో ఏర్పడిన ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఇంతకు మించి ఇవ్వడం సాధ్యం కాదని ప్రభుత్వం భావిస్తోంది. సంక్రాంతి అనంతరం పీఆర్సీపై ప్రభుత్వం జీవో జారీ చేయనుందని ఉద్యోగ సంఘాల నేతలు అంచనా వేస్తున్నారు.

ముందుగా ఉద్యోగ సంఘాలతో చర్చిస్తే ఈ విషయం ఎటూ తేలదని ప్రభుత్వం భావిస్తోంది. ఫిట్​మెంట్​ ప్రకటించిన అనతరం బెనిఫిట్స్ అంశాలపై ఉద్యోగ సంఘాలతో సీఎం కేసీఆర్ సమావేశం అవుతారని సమాచారం. ​ఫిట్​మెంట్​ను ఎప్పటి నుంచి అమలు చేస్తారని అంశంపై ఇంకా సర్కార్ తుది నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu