సెంటిమెంటును ఫాలో అయ్యే కేసీఆర్ ముహూర్తం ప్రకారం నేడు రెండు చోట్ల నామినేషన్ దాఖలు చేయనుండగా.. ఆయన బాటలోనే కేటీఆర్, హరీష్ రావులు నామినేషన్లు వేయనున్నారు.
హైదరాబాద్ : నామినేషన్లకు ఇక కొద్దిగంటలే గడువు మిగిలి ఉంది. దీంతో అన్ని పార్టీల నేతలు నామినేషన్లు సకాలంలో వేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు రెండుచోట్ల నామినేషన్లు దాఖలు చేయనున్నారు. గజ్వేల్ లో ఉదయం 11 గంటలకు.. కామారెడ్డిలో మధ్యాహ్నం రెండు గంటలకు నామినేషన్లు దాకా చేయరున్నారు
సిరిసిల్లలోమంత్రి కేటీఆర్ నామినేషన్ వేయనున్నారు. ఉదయం 11:45 నిమిషాలకు సిరిసిల్లా ఆర్డిఓ కార్యాలయంలో కేటీఆర్ నామినేషన్ వేయనున్నారు.ఇక టీఆర్ఎస్ లో మరో కీలక నేత ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కూడా నేడే నామినేషన్ వేయనున్నారు. ఈ ఉదయం హరీష్ రావు సిద్దిపేటలో నామినేషన్ వేయనున్నారు.
టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన ఈటెల రాజేందర్ కూడా ఈ రోజే నామినేషన్ వేస్తున్నారు. హుజురాబాద్ లో ఈటెల రాజేందర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. కామారెడ్డి లో నామినేషన్ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇప్పటికే బీజేపీ ముఖ్యనేత బండి సంజయ్ రెండు చోట్ల నామినేషన్లు వేశారు. సోమవారం కరీంనగర్ లో రెండు సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు.
సోమవారం నాడు కొడంగల్ లో టీపీసీసీ చైర్మన్ రేవంత్ రెడ్డి భారీ ర్యాలీగా నామినేషన్ వేశారు. ఇక మరో నామినేషన్ కామారెడ్డిలో రేపు అంటే పదో తేదీన వేయనున్నారు. రెండో జాబితాలో దీనిమీద అధికారిక ప్రకటన రావడంతో శుక్రవారం నామినేషన్ వేయనున్నారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి నామినేషన్ కు పదో తేదీన కామారెడ్డిలో భారీ ర్యాలీ, బహిరంగ సభ చేయనున్నారు. ఈ సభకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రానున్నారు.