ప్రగతి భవన్‌లో నేడు ఇద్దరు సీఎంల భేటీ

Published : Jan 13, 2020, 08:05 AM ISTUpdated : Jan 13, 2020, 01:51 PM IST
ప్రగతి భవన్‌లో  నేడు ఇద్దరు సీఎంల భేటీ

సారాంశం

తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్ సోమవారం నాడు హైద్రాబాద్‌లో సమావేశం కానున్నారు

హైదరాబాద్:  తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్ సోమవారం నాడు హైద్రాబాద్‌లో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో  రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలపై చర్చించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఇద్దరు సీఎంలు ప్రగతి భవన్ లో భేటీ  అవుతారు. 

Also read:జనవరి 13న రెండు రాష్ట్రాల సీఎంల సమావేశం

రెండు రాష్ట్రాల మధ్య దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలపై ఇద్దరు సీఎంలు చర్చించనున్నారు. ఇద్దరరు సీఎంలు  ఇప్పటికే మూడు దఫాలు సమావేశమయ్యారు. ఈ సమావేశాల్లో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలపై చర్చించారు.ఈ చర్చలకు కొనసాగింపుగానే ఇవాళ మరోసారి రెండు రాష్ట్రాల సీఎంలు సమావేశం కానున్నారు. గత ఏడాది నవంబర్ 23వ తేదీన ఇద్దరు సీఎంలు భేటీ అయ్యారు.

ఈ భేటీలో ప్రధానంగా కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంపై చర్చించారు. ఈ రెండు నదులను అనుసంధానం చేయడం ద్వారా రెండు రాష్ట్రాలకు నీటిని వినియోగించుకోవాలని భావించారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలపై ఇద్దరు సీఎంలు చర్చించి నిర్ణయం తీసుకొంటారు.

PREV
click me!

Recommended Stories

100 కోట్లకు పైగా ఆస్తులు.. ఏసీబీ వలలో భారీ అవినీతి తిమింగళం| ACB Raids on Hyderabad | Asianet Telugu
RTC: ఎర్ర బ‌స్సులు ప‌చ్చ‌గా ఎందుకు మారాయి.? దీని వెన‌కాల ఉన్న అస‌లు కార‌ణం ఏంటో తెలుసా.?