తెలంగాణ సీఎం కేసీఆర్ తో సోమవారంనాడు వీఆర్ఏలు భేటీ అయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంపై సీఎం కేసీఆర్ కు వీఆర్ఏ జేఏసీ నేతలు ధన్యవాదాలు తెలిపారు.
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ తో వీఆర్ఏలు సోమవారంనాడు సచివాలయంలో భేటీ అయ్యారు. వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ జారీ చేసిన జీవో కాపీని వీఆర్ఏ జేఏసీ నేతలకు సీఎం కేసీఆర్ అందించారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంపై వీఆర్ఏలు హర్షం వ్యక్తం చేశారు.
వీఆర్ఏలను నాలుగు ప్రభుత్వ శాఖల్లో సర్ధుబాటు చేయాలని తెలంగాణ సీఎం నిర్ణయం తీసుకున్నారు. వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించనున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. నీటి పారుదల శాఖ, పురపాలక శాఖ, పంచాయితీరాజ్ శాఖ, మిషన్ భగీరథ శాఖలో వీఆర్ఏలను సర్ధుబాటు చేయనున్నారు.
undefined
సోమవారంనాడు సాయంత్రం సచివాలయంలో వీఆర్ఏలు కేసీఆర్ తో సమావేశమయ్యారు. వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంపై వీఆర్ఏలు హర్షం వ్యక్తం చేశారు. వీఆర్ఏలను నాలుగు ప్రభుత్వశాఖల్లో సర్ధుబాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
వీఆర్ఏల విద్యార్హతలను బట్టి వారిని ఆయా ప్రభుత్వ శాఖలో సర్ధుబాటు చేయనున్నారు. 61 ఏళ్లు దాటిన వీఆర్ఏల పిల్లలకు కూడ ఉద్యోగం ఇవ్వాలని కూడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.