ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్: 2.73 శాతం డీఏ మంజూరు

Published : Jan 23, 2023, 09:10 PM ISTUpdated : Jan 23, 2023, 09:12 PM IST
 ప్రభుత్వ ఉద్యోగులకు  తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్:   2.73  శాతం డీఏ మంజూరు

సారాంశం

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు  ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.  2.73 డీఏను ప్రకటించింది.  2021 జూలై నుండి  2022 డిసెంబర్  వరకు  ఈ డీఏ బకాయిలను  ప్రభుత్వం చెల్లించనుంది.  

హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ దారులకు  ప్రభుత్వం  2.73 శాతం డిఏను  ప్రకటించింది.  2021  జూలై  నుండి 2022 డిసెంబర్ వరకు    ఉద్యోగులకు  డీఏ  బకాయిలను  ప్రభుత్వం చెల్లించనుంది.  ఎనిమిది విడతల్లో   బకాయిలను చెల్లించనున్నారు..

 

ఈ మేరకు  సోమవారం నాడు  రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.   రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు  ఉన్న డీఏను  17.29 నుండి  20.02 శాతానికి పెంచింది ప్రభుత్వం,  డీఏ పెంపుతో  4.40 లక్షల మంది ఉద్యోగులకు లబ్ది కలగనుంది.   డీఏ పెంపు కారణంగా  2.38 లక్షల మంది పెన్షనర్లకు  కూడా  ప్రయోజనం  కలగనుంది. ఎనిమిది విడతల్లో  ఉద్యోగులకు  బకాయిలను  ప్రభుత్వం చెల్లించనుంది.
 

PREV
click me!

Recommended Stories

Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. 3 రోజులు దంచికొట్టనున్న వర్షాలు.. ఈ జిల్లాల్లో డేంజర్ గాలులు
RTC: తెలంగాణ ఆర్టీసీ మ‌రో కీల‌క నిర్ణ‌యం.. ఇక‌పై బ‌స్సుల్లో మెట్రో త‌ర‌హా ఏర్పాట్లు