తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలు: షెడ్యూల్ విడుదల

By narsimha lode  |  First Published Jan 23, 2023, 7:47 PM IST

తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల విషయమై  షెడ్యూల్ ను రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది.ఈ  నెల  28వ  తేదీ నుండి  బదిలీలకు సంబంధించి  ధరఖాస్తు  చేసుకోవచ్చు.  
 


హైదరాబాద్: రాష్ట్రంలో  ఉపాధ్యాయుల బదిలీలపై తెలంగాణ  ప్రభుత్వం  సోమవారంనాడు  షెడ్యూల్ విడుదల చేసింది.  ఈ నెల  27 నుండి   ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియను ప్రభుత్వం చేపట్టనుంది. దీనికి సంబంధించి ఈ నెల  28వ తేదీ నుండి 30వ తేదీ వరకు  ఆన్ లైన్ లో ధరఖాస్తు  చేసుకొనే అవకాశం కల్పించింది  ప్రభుత్వం.ఉపాధ్యాయుల ధరఖాస్తుల ఆధారంగా  బదిలీలను నిర్వహించనుంది  ప్రభుత్వం.  మరో వైపు  ఈ ధరఖాస్తులకు సంబంధించి  మార్చి  5వ తేదీ నుండి 19వ తేదీ వరకు అప్పీళ్లు చేసుకొనే అవకాశం కల్పించింది.

ఉపాధ్యాయ సంఘాల నేతలతో  రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చర్చలు జరిపింది.  రాష్ట్ర మంత్రులు  సబితా ఇంద్రారెడ్డి, హరీష్ రావులు  ఉపాధ్యాయ సంఘాల నేతలతో  బదిలీల విషయమై  చర్చించింది.  ఉపాధ్యాయ సంఘాల  సూచనలు, సలహలు తీసుకుంది.  ఈ సమావేశంలో  ఉపాధ్యాయ సంఘాల నేతలు  తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి  తెలిపారు.  బదిలీల సమయంలో  భార్యాభర్తలను  ఒకే జిల్లాకు కేటాయించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. వేర్వేరు జిల్లాల్లో  విధులు నిర్వహిస్తున్న  ఉపాధ్యాయులు  రెండు రోజుల క్రితం  ఆందోళన నిర్వహించారు.  గతంలో  రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో భార్యాభర్తలను ఒకే జిల్లాకు బదిలీ చేయలేదని  ఉపాధ్యాయులు గుర్తు  చేస్తున్నారు. 

Latest Videos

also read:317 జీవో నిరసిస్తూ డీజీపీ ఆఫీస్ వద్ద ధర్నాకు బీజేవైఎం యత్నం:నాంపల్లిలోనే అడ్డుకున్న పోలీసులు

గతంలో  అవకాశం  దక్కని  వారికి అవకాశం  కల్పించాలని  ఉపాధ్యాయులు కోరుతున్నారు.   మరో వైపు  317 జీవో  ద్వారా బదిలీ అయిన  వారికి  ఈ దఫా కూడా అవకాశం కల్పించాలని  కొందరు  ఉపాధ్యాయులు కోరుతున్నారు. నిన్న  హైద్రాబాద్  పంజాగుట్టలో   కుటుంబ సభ్యులతో  కలిసి  ఆందోళన నిర్వహించారు ఉపాధ్యాయులు . 317 జీవో ను సవరించాలని  రాష్ట్ర ప్రభుత్వాన్ని  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్  చేశారు.ఈ విషయమై  బీజేపీ అనుబంధ సంఘాల  కార్యకర్తలు  ఇవాళ ఆందోళనలు నిర్వహించారు.  ప్రగతి భవన్ వద్ద ఆందోళనలు నిర్వహించేందుకు  ప్రయత్నించినవారిని పోలీసులు అరెస్ట్  చేశారు. డీజీపీ కార్యాలయం ముట్టడికి  వెళ్తున్న  బీజేవైఎం కార్యకర్తలను నాంపల్లిలో  పోలీసులు అరెస్ట్  చేశారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసాన్ని    బీజేపీ మైనార్టీ మోర్చా  నేతలు ముట్టడించారు.
 


 

click me!