ఈబీసి రిజర్వేషన్లపై కేసీఆర్ కేంద్రానికి మెలిక

By pratap reddyFirst Published Jan 8, 2019, 1:23 PM IST
Highlights

ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు (ఈబీసీలకు) 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యంగ సవరణ బిల్లును కేంద్రం లోకసభలో ప్రవేశపెట్టిన నేపథ్యంలో కేసీఆర్ తమ పార్టీ పార్లమెంటు సభ్యులకు తగిన సూచనలు ఇచ్చారు. 

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ తలపెట్టిన ఈబీసీ రిజర్వేషన్ల బిల్లుకు తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు మెలిక పెట్టారు. ఈ బిల్లుకు సవరణలు కోరాలని ఆయన తమ పార్టీ పార్లమెంటు సభ్యులకు మార్గనిర్దేశం చేశారు. 

ముస్లిం రిజర్వేషన్లపై కేంద్రం మీద ఒత్తిడి తేవాలని ఆయన వారికి సూచించారు. ముస్లింలకు విద్య, ఉద్యోగాల్లో 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనసభ తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ఆ బిల్లును కూడా సభలో ప్రవేశపెట్టాలని కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఆయన పార్టీ ఎంపీలను ఆదేశించారు. 

ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు (ఈబీసీలకు) 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యంగ సవరణ బిల్లును కేంద్రం లోకసభలో ప్రవేశపెట్టిన నేపథ్యంలో కేసీఆర్ తమ పార్టీ పార్లమెంటు సభ్యులకు తగిన సూచనలు ఇచ్చారు. ఈబీసి బిల్లుతో పాటు ముస్లిం రిజర్వేషన్ల బిల్లును చేర్చాలని కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఆయన ఎంపీలకు సూచించారు.

సంబంధిత వార్తలు

ఈబీసీ రిజర్వేషన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్రం

బిజెపి రాజకీయ ఎత్తుగడ: అగ్రకుల పేదలకు రిజర్వేషన్లు

ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్లు: కేంద్రం

click me!