ఈ వివాదాస్పద ఎమ్మెల్యేలకు మళ్లీ టీఆర్ఎస్ టికెట్లు... ఎవరెవరికంటే...

By Arun Kumar PFirst Published Sep 6, 2018, 7:23 PM IST
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇంకా 8 నెలల సమయం ఉండగానే రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు సిద్దమయ్యారు. ముందస్తు ఎన్నికలకు అన్ని పార్టీల కంటే ముందే సిద్దమయ్యారు కేసీఆర్. ప్రతిపక్షాలన్నీ అసెంబ్లీ రద్దు నిర్ణయం నుండి తేరుకోకముందే టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించి మరో షాక్ కు గురిచేశారు. అయితే కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో కొందరు  వివాదాస్పద సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా చోటు దక్కడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
 
టీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఎక్కువగా వివాదాల్లో చిక్కుకున్న వ్యక్తి మహబూబాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్. ఓ ప్రభుత్వ కార్యక్రమంలో తనతో అనుచితంగా   ప్రవర్తించారని జిల్లా కలెక్టర్ ప్రీతిమీనా ఇతడిపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ వివాదం సీఎం కేసీఆర్ దృష్టికి వెళ్లింది. ఇంత పెద్ద ఎత్తున ఆయనపై ఆరోపణలు వచ్చినా తాజాగా మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ అతన్నే వరించింది. 

ఇక ఇదేవిదంగా జిల్లా కలెక్టర్ తో వివాదం కారణంగా వార్తల్లో నిలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. ఈయన జనగామ ఎమ్మెల్యేగా భూకబ్జాలకు పాల్పడుతున్నట్లు స్వయంగా జిల్లా కలెక్టర్  శ్రీదేవసేన ఆరోపించారు. దీంతో ఇద్దరి మధ్య వివాదం చెలరేగి రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారితీసింది. అయితే చివరకు దేవసేన వేరే జిల్లాకు బదిలీ అవడంతో ఆ వివాదానికి తెరపడింది. అయితే వివాదాలెన్ని ఉన్నప్పటికి  ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై నమ్మకంతో కేసీఆర్ మళ్లీ జనగామ సీటు కట్టబెట్టారు.

పెద్దపల్లి జిల్లా మంథని ఎమ్మెల్యే పుట్టా మధు కూడా పలు సందర్భాల్లో వివాదాస్పత వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన వ్యక్తి. ఇతడు ఓ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు గతంలో వివాదాస్పదమైన విషయం తెలిసిందే. తాజాగా పుట్టా మధుకు కూడా కేసీఆర్ మరో అవకాశం ఇచ్చారు.

వేముల వాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ ది మరో వివాదం. అతడు ఏకంగా దేశ పౌరసత్వం విషయంలో వివాదాల్లో చిక్కుకున్నారు. అతడికి జర్మనీ పౌరసత్వం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో చట్టపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇతడికి కూడా టీఆర్ఎస్ సీటు ఖరారయ్యింది. 

click me!