టీఆర్ఎస్ మేనిఫెస్టో కమిటిని ప్రకటించిన కేసీఆర్

Published : Sep 06, 2018, 07:14 PM ISTUpdated : Sep 09, 2018, 12:28 PM IST
టీఆర్ఎస్ మేనిఫెస్టో కమిటిని ప్రకటించిన కేసీఆర్

సారాంశం

 తెలంగాణ అసెంబ్లీ రద్దు చేసిన కేసీఆర్ ముందస్తు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు పావులు కదుపుతున్నారు. అంతా ఊహించినట్లుగానే అసెంబ్లీని రద్దు చేసిన కేసీఆర్ వెనువెంటనే అభ్యర్థుల జాబితాను సైతం ప్రకటించేశారు. ఆగమేఘాల మీద టీఆర్ఎస్ మేనిఫేస్టో కమిటీని కూడా ప్రకటించేశారు కేసీఆర్.   

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ రద్దు చేసిన కేసీఆర్ ముందస్తు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు పావులు కదుపుతున్నారు. అంతా ఊహించినట్లుగానే అసెంబ్లీని రద్దు చేసిన కేసీఆర్ వెనువెంటనే అభ్యర్థుల జాబితాను సైతం ప్రకటించేశారు. ఆగమేఘాల మీద టీఆర్ఎస్ మేనిఫేస్టో కమిటీని కూడా ప్రకటించేశారు కేసీఆర్. 

పార్టీ ప్రధాన కార్యదర్శి టీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావు అధ్యక్షతన ఎన్నికల మేనిఫేస్టోను ప్రకటించారు. ఎన్నికల మేనిఫెస్టో కమిటీలో సభ్యులుగా జితేందర్‌రెడ్డి, జి.నగేష్‌, మంత్రులు ఈటల రాజేందర్, హరీష్‌రావు, జగదీష్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, చందూలాల్‌, పద్మారావుతోపాటు కొప్పుల ఈశ్వర్, ‌పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఫరీదుద్దీన్‌, పి.రాములు, గుండు సుధారాణినిలను నియమించారు. 

ప్రజా ఆమోదయోగ్యమైన మేనిఫెస్టోను రూపొందించాలని కమిటీకి ఆపధర్మ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసిన నేపథ్యంలో ప్రజలను ఆదరించే మంచి మేనిఫెస్టోను రూపొందించాలని కోరారు. అలాగే అభ్యర్థులు అంతా తమ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించాలని కేసీఆర్ సూచించారు. 

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?