Mallareddy: కేసీఆర్ కుటుంబంలో ముగ్గురికి పదవులు.. నా కుటుంబంలో కూడా కావాలి: మల్లారెడ్డి

By Mahesh K  |  First Published Feb 9, 2024, 6:05 PM IST

మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబంపై కామెంట్లు చేశారు. కేసీఆర్ కుటుంబంలో ముగ్గురికి పదవులు ఉన్నట్టే తన కుటుంబంలో ఉంటే తప్పేంటీ అని ప్రశ్నించారు. తన కొడుక్కి మల్కాజిగిరి బీఆర్ఎస్ టికెట్ కన్ఫామ్ అయిందని అన్నారు.
 


మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మల్కాజిగిరి లోక్ సభ బీఆర్ఎస్ టికెట్ తన కొడుకుకు కన్ఫామ్ అయిందని పేర్కొన్నారు. ఇక కేసీఆర్ ఆదేశాలే మిగిలి ఉన్నాయని అన్నారు. తన కొడుకు పోటీకి సిద్ధంగా ఉన్నాడని వివరించారు. అంటితో ఆగలేదు.. కేసీఆర్ కుటుంబంపైనా ఆయన వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ కుటుంబంలో ముగ్గురికి పదవులు ఉన్నాయని మల్లారెడ్డి అన్నారు. తనకు కూడా అదే కోరిక ఉన్నదని వివరించారు. తన కుటుంబంలో కూడా ముగ్గురికి పదవులు ఉంటే తప్పేంటి అని అడిగారు. ఇవే తనకు చివరి ఎన్నికలు అని మల్లారెడ్డి అన్నారు. ఈ ఎన్నికల తర్వాత తాను గోవా వెళ్లి కాలం గడుపుతానని వివరించారు.

Latest Videos

Also Read : CM Revanth Reddy: గూడ అంజన్న చివరి కోరిక కేసీఆర్‌ను చూడాలని.. కానీ.. : సీఎం రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తోపాటు ఆయన కొడుకు కేటీఆర్, మేనల్లుడు హరీశ్ రావులు ఎమ్మెల్యేలుగా ఉన్న సంగతి తెలిసిందే.

click me!