2024 ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని దింపి రైతుల ప్రభుత్వం రానుందని తెలంగాణ సీఎం కేసీఆర్ ధీమాను వ్యక్తం చేశారు. బీజేపీ ముక్త్ భారత్ దిశగా మనమంతా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని సీఎం తెలిపారు.
పెద్దపల్లి: 2024 ఎన్నికల్లో బీజేపీ ముక్త్ భారత్ దిశగా మనమంతా సన్నద్దంగా ఉండాలని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. కేంద్రంలో బీజేపీని పారదోలి రైతుల ప్రభుత్వం రానుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్ కార్యాలయాన్ని, నూతన కలెక్టరేట్ ను ప్రారంభించిన తర్వాత సోమవారం నాడు పెద్దపల్లిలో నిర్వహించిన సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. నెత్తురు పారిస్తామంటున్న పిశాచులకు తగిన బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
undefined
దేశంలోని రైతులు వ్యవసాయానికి ఉపయోగించే విద్యుత్ కేవలం 20.08 శాతం మాత్రమేనని కేసీఆర్ చెప్పారు. ఈ విద్యుత్ కు రూ. 1.45 లక్షల కోట్లు మాత్రమేనని కేసీఆర్ తెలిపారు.వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలనే బీజేపీకి రైతులు బుద్ది చెప్పాలని కేసీఆర్ కోరారు. రైతుల విద్యుత్ కోసం చేసే ఖర్చు ఒక కార్పోరేట్ దొంగకు దోచిపెట్టినంత కూడా కాదని సీఎం వివరించారు.
రైతుల వ్యవసాయ మోటార్లకు ఎందుకు మీటర్లు పెట్టాలని కేసీఆర్ ప్రశ్నించారు. రైతులకు ఉచితంగా విద్యుత్ ఇస్తే... మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తిడి తెస్తుందని కేసీఆర్ ఆరోపించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు వద్దని పోరాటం చేయాలని రైతు సంఘాల నేతలు తనకు చెప్పారన్నారు. రైతుల వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టే మోడీకి మీటర్లు పెట్టాల్సిన అవసరం ఉందని కేసీఆర్ చెప్పారు. కేంద్రం 12 లక్షల కోట్ల రూపాయాలను కార్పోరేట్ దొంగలకు దోచిపెట్టారని కేసీఆర్ విమర్శించారు.. కానీ రైతులకు రూ. 1 45 లక్షల కోట్లు ఖర్చు చేస్తే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. శ్రీలంకకు వెళ్లిన మోడీని అక్కడి ప్రజలు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారని ఆయన గుర్తు చేశారు.
గుజరాత్ మోడల్ అని చెప్పి దేశ ప్రజల్ని నరేంద్ర మోడీ మోసం చేశారన్నారు. గాంధీ పుట్టిన రాష్ట్రంలో మద్య నిషేధం చేశామని చెబుతున్నారన్నారు. గుజరాత్ రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతుందన్నారు. దీనికి ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దొంగల బూట్లు మోసే సన్నాసులు తెలంగాణలో ఉన్నారని కేసీఆర్ పరోక్షంగా బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు. గజదొంగలు, లంచగొండులు ఇక్కడికి వచ్చి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం తెలివి తక్కువ విధానాల వల్ల గోధువులు, బియ్యం దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. దేశ ఆర్ధిక పరిస్థితిని, రూపాయి విలువను కేంద్ర ప్రభుత్వం దిగజార్చిందని కేసీఆర్ విమర్శించారు.
also read:పెద్దపల్లి జిల్లా నూతన కలెక్టరేట్ భవనం: ప్రారంభించిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనందునే పెద్దపల్లి కొత్తగా జిల్లా ఏర్పాటు చేసుకున్నట్టు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో 26 రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల ప్రతినిధులు పర్యటించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. తమ రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న ఏ ఒక్క పథకం కూడా అమలు చేయడం లేదన్నారు. జాతీయ రాజకీయాల్లోకి రావాలని రైతు సంఘాల ప్రతినిధులు తనను కోరారని ఆయన చెప్పారు.