తెలంగాణ కానిస్టేబుల్ రాత పరీక్ష: 13 ప్రశ్నల్లో గందరగోళం, మార్కులు కలపాలని డిమాండ్

By narsimha lodeFirst Published Aug 29, 2022, 3:00 PM IST
Highlights

తెలంగాణ కానిస్టేబుల్ రాత పరీక్షల్లో తప్పు ప్రశ్నలు వచ్చాయని రాత పరీక్షకు హాజరైన  అభ్యర్ధులు ఆరోపిస్తున్నారు. 13 ప్రశ్నలు గందరగోళంగా ఉన్నాయని  అభ్యర్ధులు ఆరోపిస్తున్నారు.ఈ విషయమై తమకు న్యాయం చేయాలని అభ్యర్ధులు కోరుతున్నారు. 

హైదరాబాద్: నిన్న జరిగిన తెలంగాణ కానిస్టేబుల్ రాత పరీక్షల్లో  కొన్ని తప్పులు ఉన్నాయని అభ్యర్ధులు చెబుతున్నారు. 13 ప్రశ్నలు గందరగోళంగా ఉన్నాయని వారు చెబుతున్నారు.ఈ విషయమై తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డుకు అభ్యర్ధులు ఫిర్యాదు చేస్తున్నారు.  ఈ విషయమై అభ్యర్ధుల నుండి భారీ ఎత్తున ఫిర్యాదులు వస్తే  పరీక్షకు హాజరైన అభ్యర్ధులందరికీ కూడా మార్కులను కలిపే అవకాశం లేకపోలేదు. 13 ప్రశ్నల్లో చోటు చేసుకున్న గందరగోళం కారణంగా  గరిష్టంగా 8 మార్కులను పరీక్ష రాసిన అందరూ అభ్యర్ధులకు కలిపే అవకాశం ఉందని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.

తెలంగాణలో కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకం కోసం నిన్న రాత పరీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1601 పరీక్షా కేంద్రాల్లో కానిస్టేబుల్ రాత పరీక్షలను నిర్వహించారు. కానిస్టేబుల్ రాత పరీక్ష కోసం సుమారు 6.61 లక్షల మంది ధరఖాస్తు చేసుకున్నారు.  6లక్షల 3 వేల 955 మంది అభ్యర్ధులు పరీక్ష రాశారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా అభ్యర్ధులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. 15, 644 సివిల్, 63 ఎక్సైజ్, 614 రవాణా శాఖలో కానిస్టేబల్ పోస్టులకు నిన్న రాత పరీక్ష నిర్వహించారు.  నిన్న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరిగింది.

also read:ప్రారంభమైన తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్ష: నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

నిన్న నిర్వహించిన కానిస్టేబుల్ రాత పరీక్ష ప్రశ్నా పత్రంలో  కొన్ని ప్రశ్నలు గందరగోళంగా ఉన్నాయని అభ్యర్ధులు ఆందోళన చెందుతున్నారు. ఈ  ప్రశ్నలకు గాను తమకు మార్కులు కేటాయించాలని కోరుతున్నారు. మొత్తం 200 మార్కుల పేపర్లో 13 ప్రశ్నలు గందరగోళంగా ఉన్నాయని అభ్యర్ధులు ఆరోపిస్తున్నారు. అయితే  ఈ ప్రశ్నల విషయమై పరీక్ష రాసిన అభ్యర్ధులు రిక్రూట్ మెంట్ బోర్డుకు పెద్ద ఎత్తున పిర్యాదులు చేస్తే ఈ ప్రశ్నల విషయమై బోర్డు నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంటుందని ఈ కథనం తెలిపింది.

రెండు రోజుల్లో స్పష్టత: పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు చైర్మెన్  శ్రీనివాసరావు

పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్షలో 13 ప్రశ్నలు గందరగోళంగా ఉన్న విషయం పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు దృష్టికి వచ్చింది.  సెట్ -డిలో 13 ప్రశ్నల్లో గందరగోళం తలెత్తిందని బోర్డుకు ఫిర్యాదులు వచ్చాయి.  ఈ ప్రశ్నలపై పరిశీలించి రెండు రోజుల్లో స్పష్టత ఇస్తామని తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు చైర్మెన్ శ్రీనివాసరావు ప్రకటించారు. ఈ విషయమై బోర్డు నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎలాంటి ప్రచారాన్ని నమ్మవద్దని కూడా శ్రీనివాసరావు ప్రకటించారు.  ప్రశ్నా పత్రంలో 13 ప్రశ్నల్లో గందరగోళం విషయమై నిపుణుల కమిటీతో చర్చించి వారిచ్చే రిపోర్టు ఆధారంగా నిర్ణయం తీసుకొంటామని బోర్డు చైర్మెన్ శ్రీనివాసరావు తెలిపారు. 


 

 


 

click me!