
హైదరాబాద్: ఆరు నూరైనా ఈ దఫా ముందస్తు ఎన్నికలకు వెళ్లబోమని KCR చెప్పారు. గతంలో అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి కూడా కారణం ఉందన్నారు. సోమవారం నాడు టీఆర్ఎస్ శాసనససభపక్ష సమావేశం ముగిసిన తర్వాత ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు.
మళ్లీ రాష్ట్రంలో TRS నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కావాలనే ఉద్దేశ్యంతోనే 2018లో తాను ముందస్తు ఎన్నికలకు వెళ్లినట్టుగా కేసీఆర్ వివరించారు. ఈ దఫా early electionsఎన్నికలకు పోమన్నారు. తొలుత 63 సీట్లు, 2018లో 88 seats, ఈ దఫా 95 నుండి 105 సీట్లను గెలుస్తామని కేసీఆర్ ధీమాను వ్యక్తం చేశారు. ఇప్పటికే మూడు సంస్థల నుండి సర్వేలు నిర్వహించామన్నారు. త్వరలోనే ఈ సర్వే వివరాలను కూడా మీడియాకు ఇస్తామని కేసీఆర్ చెప్పారు. ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడేవారికి మతి లేదన్నారు. ఇప్పటికే 30 సీట్లలో సర్వే నిర్వహించామన్నారు. అయితే ఒక్క స్థానంలో అతి తక్కువ ఓట్లతో ఓటమి పాలు కానుందని ఈ సర్వేలో తేలిందని చెప్పారు.
పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ తో పాటు ఇతర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లు పూర్తి కావాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇంకా ధాన్యం పండించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
అయితే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వస్తాయని కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు చెబుతున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలను కేసీఆర్ కొట్టిపారేశారు. గతంలో కూడా ఇదే విషయమై కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లబోమని చెప్పారు.
దేశ రాజకీయాల్లో భారీ మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ రాజకీయాల్లో తాను కీలకపాత్ర పోషిస్తానని కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. ఫ్రంట్ పెడతానా ఏం చేస్తానా అనేది ఇంకా ఖరారు కాలేదన్నారు. రాజకీయాల్లో ట్రెండ్, ఈక్వేషన్ పట్టుకోవాలన్నారు. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయడానికి ముందున్న పరిస్థితులను ఆయన ప్రస్తావించారు. 2024 లో సంపూర్ణ క్రాంతి వైపునకు దేశం వెళ్లనుందని కేసీఆర్ చెప్పారు.
పలు రాష్ట్రాల్లో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయన్నారు. ఈ సమావేశాలు ముగిసిన తర్వాత సీఎంలతో పాటు ఆయా పార్టీల ముఖ్యులను కలుస్తామన్నారు. అయితే జాతీయ రాజకీయాల్లో ఏ రకమైన విధానాలతో ముందుకు వెళ్లాలనే దానిపై పలువురితో చర్చిస్తున్నామన్నారు.
సీబీఐ,ఈడీ, ఆదాయ పన్ను శాఖ దాడులు చేస్తారని తనపై ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ రకమైన దాడులకు తాను భయపడుతానా అని కేసీఆర్ ప్రశ్నించారు. తనపై దాడులు చేయాలని కూడా కేసీఆర్ సవాల్ విసిరారు.
దేశంలో రాజకీయ సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందన్నారు. అయితే ఈ విషయమై ప్రశాంత్ కిషోర్ తో తాను చర్చించినట్టుగా చెప్పారు. ప్రశాంత్ కిషోర్ సంస్థ తమతో కలిసి పనిచేస్తున్నట్టుగా కేసీఆర్ వివరించారు. ప్రశాంత్ కిషోర్ నాతో కలిసి పనిచేస్తే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. దేశంలో పరివర్తన కోసం తాను ప్రశాంత్ కిషోర్ తో కలిసి పనిచేస్తున్నానన్నారు. గత ఏడేనిమిది ఏళ్లుగా తనకు ప్రశాంత్ కిషోర్ తో స్నేహం ఉందని కేసీఆర్ వివరించారు.
దేశంలోని 12 రాష్ట్రాల్లో ప్రశాంత్ కిషోర్ పని చేశాడన్నారు. మమత, స్టాలిన్, జగన్ తో పాటు పలు రాష్ట్రాల్లో పని చేశారని కేసీఆర్ చెప్పారు. ప్రశాంత్ కిషోర్ డబ్బులు తీసుకోని పని చేయడన్నారు.