
హైదరాబాద్: వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకపోతే తెలంగాణ ఉద్యమం తరహాలో పోరాటం చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు.సోమవారం నాడు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ శాసనసభపక్ష సమావేశం ముగిసిన తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఈ సమావేశం తీర్మానం చేసినట్టుగా సీఎం KCR చెప్పారు.
ఈ విషయమై రేపు మంత్రులు, ఎంపీలు కేంద్ర ఆహార శాఖ మంత్రిని కలవనున్నట్టుగా కేసీఆర్ చెప్పారు.Paddy ధాన్యం కొనుగోలు విషయంలో దేశమంతా ఒకే విధానం ఉండాలని తాము కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామని కేసీఆర్ చెప్పారు. Punjab రాష్ట్రంలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టే Telangana నుండి కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది రైతుల జీవన్మరణ సమస్యగా కేసీఆర్ చెప్పారు.
వరి ధాన్యం కొనుగోలు విషయంంలో మెలికలు పెట్టొద్దని కేసీఆర్ కేంద్రాన్ని కోరారు. వరి ధాన్యానికే ఎంఎస్‌పీ నిర్ణయిస్తారన్నారు. పంజాబ్ లో ఎలా కొనుగోలు చేస్తున్నారో తమ రాష్ట్రం నుండి వరి ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. రా రైస్ తీసుకుంటారా, బాయిల్డ్ రైస్ తీసుకుంటారా అనేది కేంద్రం నిర్ణయమే అని ఆయన చెప్పారు.30 లక్షల ఎకరాల్లో పండిన వరి ధాన్యం కొనుగోలు చేయాలన్నారు.
వరి ధాన్యం కొనుగోలు చేయకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు స్థాయిలో ఉద్యమం ఉంటుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని వరి ధాన్యం కొనుగోలు చేయాలని స్థానిక సంస్థలు తీర్మానం చేయాలని కోరనున్నట్టుగా కేసీఆర్ తెలిపారు.
సమాజాన్ని డివైడ్ చేయాలని కేంద్రం ప్రయత్నిస్తుందన్నారు. ప్రజల మధ్య విద్వేషం కల్గించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కశ్మీర్ పైల్స్ ఏమిటని ప్రశ్నించారు. డెవలప్‌మెంట్స్ ఫైల్స్ ఉండాలి కానీ, కశ్మీర్ ఫైల్స్ ఏంటని కేసీఆర్ అడిగారు. ఏ రకంగా చూసినా కూడా కశ్మీర్ ఫైల్స్ విభజన రాజకీయాలు తప్ప మరోటి కాదని తేలిందని కేసీఆర్ వివరించారు.,
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు ఇచ్చి కాశ్మీర్ ఫైల్స్ సినిమాను చూడాలని కోరడం ఎంత దౌర్భాగ్యమని ఆయన ప్రశ్నించారు. దేశంలో బీజేపీ బలం తగ్గిపోతోందన్నారు. యూపీ ఎన్నికల్లో బీజేపీ సీట్లు తగ్గుతాయని తాను గతంలోనే చెప్పిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. యూపీలో గతంలో వచ్చిన సీట్ల కంటే తక్కువ సీట్లు వచ్చాయన్నారు.
ఉత్తరాఖండ్ లో కూడా అదే రకమైన పరిస్థితి నెలకొందన్నారు. యూపీలో, ఉత్తరాఖండ్ లో ఎందుకు సీట్లు తగ్గాయో ఆలోచించాలని కేసీఆర్ హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తుందన్నారు.