దేశంలో రాజకీయ శూన్యత, 2024 ఎన్నికల నాటికి కొత్త రాజకీయ వేదిక: కేసీఆర్

Published : Mar 21, 2022, 06:03 PM ISTUpdated : Mar 21, 2022, 07:27 PM IST
దేశంలో రాజకీయ శూన్యత, 2024 ఎన్నికల నాటికి కొత్త రాజకీయ వేదిక: కేసీఆర్

సారాంశం

దేశ రాజకీయాల్లో రాజకీయ శూన్యత ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. 2024లో దేశం సంపూర్ణ క్రాంతి వైపునకు వెళ్లనుందన్నారు. ఇవాళ హైద్రాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. 

హైదరాబాద్: దేశ రాజకీయాల్లో  రాజకీయ శూన్యత  ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు.భారత ప్రజల అనుకూల రాజకీయ వ్యవస్థ రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. సోమవారం నాడు టీఆర్ఎస్ శాసనసభపక్ష సమావేశం ముగిసిన తర్వాత KCR హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. తన రాజకీయ అనుభవంతో చెబుతున్నానన్నారు. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి తప్పకుండా వస్తుందని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.పరిపూర్ణ సమయంలో పరిపూర్ణమైన వేదిక సిద్దం కానుందన్నారు. 

అంతేకాదు జాతీయ స్థాయిలో కొత్త పార్టీ రావొచ్చు కదా అని ఆయన ప్రశ్నించారు. రాకూడదా అని అడిగారు.  కేంద్ర ప్రభత్వం  ప్రజలకు ఆశించిన మేరకు ప్రయోజనం కల్గించడం లేదని తేట తెల్లమైందన్నారు. UPA కంటే NDA  ఘోరంగా విఫలమైందని చెప్పారు. ఎన్నికలు వచ్చే సమయంలో భావోద్వేగాలు రెచ్చగొడుతూ రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నారని BJPపై కేసీఆర్ మండి పడ్డారు. యూపీ ఎన్నికల ప్రచారంలో ఏం జరిగిందని ఆయన ప్రశ్నించారు. 

దేశ రాజకీయాల్లో భారీ మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ రాజకీయాల్లో తాను కీలకపాత్ర పోషిస్తానని కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు.  ఫ్రంట్ పెడతానా ఏం చేస్తానా అనేది  ఇంకా ఖరారు కాలేదన్నారు.  రాజకీయాల్లో ట్రెండ్, ఈక్వేషన్ పట్టుకోవాలన్నారు. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయడానికి ముందున్న పరిస్థితులను ఆయన ప్రస్తావించారు. 2024 లో సంపూర్ణ క్రాంతి వైపునకు దేశం వెళ్లనుందని కేసీఆర్ చెప్పారు. 

పలు రాష్ట్రాల్లో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయన్నారు. ఈ సమావేశాలు ముగిసిన తర్వాత సీఎంలతో పాటు ఆయా పార్టీల ముఖ్యులను కలుస్తామన్నారు. అయితే జాతీయ రాజకీయాల్లో ఏ రకమైన విధానాలతో ముందుకు వెళ్లాలనే దానిపై పలువురితో చర్చిస్తున్నామన్నారు.  

సీబీఐ,ఈడీ, ఆదాయ పన్ను శాఖ దాడులు చేస్తారని తనపై ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ రకమైన దాడులకు తాను భయపడుతానా అని కేసీఆర్ ప్రశ్నించారు.  తనపై దాడులు చేయాలని కూడా కేసీఆర్  సవాల్ విసిరారు. 

దేశంలో రాజకీయ సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందన్నారు. అయితే ఈ విషయమై ప్రశాంత్ కిషోర్ తో తాను చర్చించినట్టుగా చెప్పారు. ప్రశాంత్ కిషోర్  సంస్థ తమతో కలిసి పనిచేస్తున్నట్టుగా కేసీఆర్ వివరించారు. ప్రశాంత్ కిషోర్  నాతో కలిసి పనిచేస్తే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. దేశంలో పరివర్తన కోసం తాను ప్రశాంత్ కిషోర్ తో కలిసి పనిచేస్తున్నానన్నారు. గత ఏడేనిమిది ఏళ్లుగా తనకు ప్రశాంత్ కిషోర్ తో స్నేహం ఉందని కేసీఆర్ వివరించారు. 

దేశంలోని 12 రాష్ట్రాల్లో ప్రశాంత్ కిషోర్ పని చేశాడన్నారు. మమత, స్టాలిన్, జగన్ తో పాటు పలు రాష్ట్రాల్లో పని చేశారని కేసీఆర్ చెప్పారు. ప్రశాంత్ కిషోర్ డబ్బులు తీసుకోని పని చేయడన్నారు.  జాతీయ రాజకీయాల్లో ఏ రకమైన మార్పులను ప్రజలు కోరుకుంటున్నారనే విషయమై ప్రజల నుండి సమాచార సేకరణ చేస్తున్నామని కేసీఆర్ చెప్పారు.

ఈ దఫా ముందస్తు ఎన్నికలకు వెళ్లబోనని కేసీఆర్ స్పష్టం చేశారు.మళ్లీ రాష్ట్రంలో TRS  నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కావాలనే ఉద్దేశ్యంతోనే  2018లో తాను ముందస్తు ఎన్నికలకు వెళ్లినట్టుగా కేసీఆర్ వివరించారు. ఈ దఫా early electionsఎన్నికలకు పోమన్నారు. తొలుత 63 సీట్లు, 2018లో 88 seats, ఈ దఫా 95 నుండి 105 సీట్లను గెలుస్తామని కేసీఆర్ ధీమాను వ్యక్తం చేశారు. ఇప్పటికే మూడు సంస్థల నుండి సర్వేలు నిర్వహించామన్నారు.  త్వరలోనే ఈ సర్వే వివరాలను కూడా మీడియాకు ఇస్తామని కేసీఆర్ చెప్పారు. ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడేవారికి మతి లేదన్నారు.  ఇప్పటికే 30  సీట్లలో సర్వే నిర్వహించామన్నారు. అయితే ఒక్క స్థానంలో అతి తక్కువ ఓట్లతో ఓటమి పాలు కానుందని ఈ సర్వేలో తేలిందని చెప్పారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

మనల్ని ఎవర్రా ఆపేది.. తెలంగాణలో తిరుగుతాం..పవన్ కళ్యాణ్ | Pawan Kalyan Latest Speech| Asianet Telugu
తెలంగాణ రాజకీయాల్లో దడ పుట్టించే పవన్ ఫైర్ స్పీచ్ | Pawan Kalyan Pressmeet | Asianet News Telugu