బీఆర్ఎస్, లెఫ్ట్ మధ్య పొత్తుకు బ్రేక్:కొత్త పొడుపులు పొడిచేనా?

By narsimha lode  |  First Published Aug 21, 2023, 4:09 PM IST

బీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీల మధ్య వచ్చే ఎన్నికల్లో పొత్తు లేనట్టేనని తేలింది. 115 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల ప్రకటనతో ఈ విషయం తేట తెల్లమైంది.



హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలతో  పొత్తు ఉండదని తేలింది.  వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తో కలిసి వెళ్దామని  లెఫ్ట్ పార్టీలు ప్రకటించాయి.  అయితే  పొత్తు విషయమై  బీఆర్ఎస్ నాయకత్వం మాత్రం పొత్తు లేదని తేల్చి చెప్పింది.  గతంలో మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కు  సీపీఐ, సీపీఎంలు మద్దతు ప్రకటించాయి. లెఫ్ట్ పార్టీల మద్దతుతో మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి బీఆర్ఎస్ విజయం సాధించింది.  లెఫ్ట్ పార్టీ మద్దతు లేకపోతే   బీఆర్ఎస్ అభ్యర్థి విజయం అసాధ్యమని  ఆనాడు ప్రత్యర్థి పార్టీలు అభిప్రాయపడ్డాయి.  ఆ తర్వాత కూడ  బీఆర్ఎస్ తో  పొత్తు  కొనసాగుతుందని  లెఫ్ట్ పార్టీలు ప్రకటించాయి. 

వచ్చే ఎన్నికల్లో కనీసం నాలుగు నుండి ఐదు అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని సీపీఐ, సీపీఎంలు బీఆర్ఎస్ ను కోరాయి. అయితే  రెండు పార్టీలకు ఒక్కొక్క అసెంబ్లీ సీటును  ఇచ్చేందుకు మాత్రమే  బీఆర్ఎస్ నాయకత్వం సుముఖంగా ఉంది. మూడు పార్టీల మధ్య  పొత్తుల విషయమై ప్రతిష్టంభన నెలకొంది. సీట్ల విషయమై  లెఫ్ట్ పార్టీల నుండి వచ్చిన ప్రతిపాదన నుండి బీఆర్ఎస్ నుండి  సానుకూల స్పందన రాలేదు. ఇవాళ కేసీఆర్  115 అభ్యర్థులను ప్రకటించారు.  లెఫ్ట్ పార్టీలతో  పొత్తు లేదని  కేసీఆర్ చెప్పకనే చెప్పారు.  కేసీఆర్ నిర్ణయంపై  లెఫ్ట్ పార్టీలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

Latest Videos

మునుగోడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడ  లెఫ్ట్ పార్టీలను తమతో కలిసి రావాలని కాంగ్రెస్ కోరింది.  రానున్న ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు స్వంతంగా పోటీ చేస్తాయా లేదా  ఇతర పార్టీలతో కలిసి పోటీ చేస్తాయా  అనే విషయమై  రానున్న రోజుల్లో తేలనుంది.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోనూ, తెలంగాణలో కూడ  లెఫ్ట్ పార్టీలు పలు పార్టీలతో  పొత్తులు పెట్టుకున్నాయి.  ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలతో  లెఫ్ట్ పార్టీలు  పొత్తు పెట్టుకున్నాయి.  తెలంగాణ రాష్ట్రంలో కూడ గత ఎన్నికల్లో  మహాకూటమిగా  పోటీ చేశాయి.  

also read:వచ్చే ఎన్నికల్లో 95కిపైగా అసెంబ్లీ స్థానాల్లో విజయం: కేసీఆర్

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  ఎన్టీఆర్  కాలం నుండి  టీడీపీతో  సీపీఐ, సీపీఎంల మధ్య  సంబంధాలు కొనసాగాయి. చంద్రబాబు కూడ  ఆ సంబంధాలను కొనసాగించారు.  1999 ఎన్నికలకు ముందు చంద్రబాబు లెఫ్ట్ పార్టీలను వదులుకొని  బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు.  1999 ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు స్వంతంగా పోటీ చేశాయి.  2004 ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ పార్టీలు, బీఆర్ఎస్ కలిసి పోటీ చేశాయి.  2009లో  బీఆర్ఎస్, లెఫ్ట్ , టీడీపీలు కలిసి పోటీ చేశాయి. 2014లో సీపీఐ బీఆర్ఎస్ తో కలిసి పోటీ చేసింది. సీపీఎం బహుజన లెఫ్ట్ ప్రంట్  ను ఏర్పాటు చేసి పోటీ చేసింది. 2018 ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్,  లెఫ్ట్ పార్టీలు ఫ్రంట్ గా పోటీ చేశాయి.

click me!