అక్టోబర్‌లో 16న వరంగల్‌లో భారీ ర్యాలీ.. అదే రోజున బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో : కేసీఆర్

Siva Kodati |  
Published : Aug 21, 2023, 03:28 PM IST
అక్టోబర్‌లో 16న వరంగల్‌లో భారీ ర్యాలీ.. అదే రోజున బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో : కేసీఆర్

సారాంశం

అక్టోబర్ 16న బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటిస్తామన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్.  ఆరోజున వరంగల్‌లో భారీ ర్యాలీ నిర్వహిస్తామని.. 95 నుంచి 105 సీట్లు గెలుస్తామని.. నేతల విజ్ఞప్తితోనే కామారెడ్డిలో పోటీ చేస్తున్నట్లుగా ముఖ్యమంత్రి వెల్లడించారు.  

త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 115 మందితో బీఆర్ఎస్ తొలి జాబితాను ప్రకటించారు ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్ధులను ప్రకటించిన ఆయన పనితీరు సరిగా లేని ఏడుగురు  సిట్టింగ్‌లకు సీట్లు నిరాకరించారు. అలాగే అక్టోబర్ 16న వరంగల్ భారీ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. అదే రోజున మేనిఫెస్టోను ప్రకటిస్తామని వెల్లడించారు. నియోజకవర్గాల్లో సమస్యలు పరిష్కరించేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని నియమిస్తామని సీఎం తెలిపారు.

పరిస్ధితులను బట్టి అభ్యర్ధులును మారుస్తామని.. ఈ విధంగానే ఏడు చోట్ల మార్పులు జరిగాయని కేసీఆర్ వెల్లడించారు. నాలుగు  స్థానాల్లో అభ్యర్ధులను ప్రకటించాల్సి వుందని సీఎం పేర్కొన్నారు. 95 నుంచి 105 సీట్లు గెలుస్తామని.. నేతల విజ్ఞప్తితోనే కామారెడ్డిలో పోటీ చేస్తున్నట్లుగా ముఖ్యమంత్రి వెల్లడించారు.  ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘించినా చర్యలు తప్పవని కేసీఆర్ హెచ్చరించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం