తెలుగు ప్రజలకు కేసీఆర్, చంద్రబాబు, పవన్ , బాలయ్య న్యూఇయర్ విషెస్

By Siva KodatiFirst Published Jan 1, 2022, 2:39 AM IST
Highlights

రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (kcr) నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఏటా వినూత్న పంథాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూ సబ్బండ వర్గాలు ప్రగతి పథాన పురోగమించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని సీఎం అన్నారు.

రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (kcr) నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఏటా వినూత్న పంథాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూ సబ్బండ వర్గాలు ప్రగతి పథాన పురోగమించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని సీఎం అన్నారు. 2022 కొత్త సంవత్సరంలో కూడా కష్టాలను అధిగమిస్తూ అదే అకుంఠిత దీక్షతో సుపరిపాలనను కొనసాగిస్తూ .. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. 2022 నూతన సంవత్సరంలో ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు.  

అటు గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ కూడా రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది అందరూ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని గవర్నర్‌ ఆకాంక్షించారు. అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Also Read:నూతనం… ప్రారంభం.. ఆరంభం.. New Year Whises చెప్పిన Pawan Kalyan

ఇదిలా ఉంటే..  ప్ర‌ముఖలు, సెల‌బ్రెటీలు, రాజ‌కీయ నాయకులు న్యూ ఇయ‌ర్ విషెష్ తెలుపుతోన్నారు. ఈ నేపథ్యంలో జ‌న‌సేన అధినేత పవన్ కళ్యాణ్.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు, త‌న ట్విట్ట‌ర్ ఖాతా వేదిక‌గా.. తెలుగు రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను శుభాకాంక్ష‌లు అందించారు.  "నూతనం... ప్రారంభం.. ఆరంభం.. కొత్త ఆనే పదాలలోనే ఒక ఉత్తేజం నిబిడీకృతమై ఉంటుంది. అటువంటిది మరి కొత్త సంవత్సరం అంటే..? ఎన్నో ఆశలు, ఎన్నో ఆశయాలు, మరెన్నో ఆకాంక్షలు... లుూలతో సంగమమై మన ముందుకు తరలివస్తుంది. అలా మన ముందు ఆవిష్క్పృతనువుతున్న 2022 నవ వసంతానికి ఆహ్వానం పలుకుతూ తెలుగువారందరితోపాటు భారతీయులందరికీ నా తరపున, జనస్‌న పార్టీ తరఫున ప్రేమపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాను అన్నారు. 

అలాగే... ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త సంవ‌త్స‌రం అందరూ ఆనందోత్సాహాలతో గడపాలని, ప్రతి ఇంటా సంతోషం, చిరునవ్వులు వెల్లివిరియాలని  ఆకాంక్షించారు. త‌మ‌ తమ రంగాల్లో ఉన్నతస్థానం చేరుకోవాలని కోరుకున్నారు. కొత్త ఏడాదిలో యువతరం లక్ష్యాలు, కలలు నెరవేరాలని ఆశించారు. 
 
టాలీవుడ్ అగ్రనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా తెలుగు ప్ర‌జ‌ల‌కు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త సంవ‌త్స‌రం..  తెలుగు ప్ర‌జ‌లంద‌రికీ అఖండ విజయం చేకూరాలని తెలిపారు. రైతులు, కార్మికులు, మహిళల జీవితాల్లో సుఖ సంతోషాలు నిండాలని పేర్కొన్నారు. అందరికీ ఆయురారోగ్యం, ఆనందం కలగాలని ఆకాంక్షిస్తున్నట్టు వివరించారు.

click me!