Telangana liquor sales: న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా.. తెలంగాణలో మద్యం ఏరులై పారుతోంది. డిసెంబర్ నెలలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయని తెలంగాణ ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. బిల్లింగ్ ముగించే సమయానికి దాదాపు 40 లక్షల కేసుల మద్యం, 34 లక్షల కేసులు బీర్ల అమ్మకాలు జరిగినట్టు ప్రకటించింది. న్యూ ఇయర్ సందర్భంగా శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల వరకూ బార్లు తెరిచి ఉంచేందుకు ఎక్సెజ్‌శాఖ అనుమతిచ్చింది.
Telangana liquor sales: న్యూ ఇయర్ అంటేనే పుల్ జోష్.. కొత్త సంవత్సరానికి కోటి ఆశలతో స్వాగతం పలకడానికి.. అందరూ పార్టీ మూడ్‌లోకి వెళ్లిపోతారు. ఇక మందుబాబుల పోత మాములుగా లేదు. న్యూ ఇయర్ వేడుకల్లో మద్యం ఏరులై పారుతోంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం లిక్కర్ సేల్స్ విషయంలో మరో రికార్డు సృష్టించింది. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 (బిల్లింగ్ ముగిసే సమయానికి) మధ్య రాష్ట్రంలో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. ఈ నెలలో రూ.3,350 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలంగాణ ఎక్సైజ్ శాఖ (liquor sales record in Telangana) ప్రకటించింది.
ఈ నెలలో దాదాపు 40 లక్షల కేసుల లిక్కర్ విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా 34 లక్షల కేసుల బీర్లు కొనుగోలు చేశారని తెలంగాణ ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. తెలంగాణ చరిత్రలో ఈ స్థాయి లిక్కర్ విక్రయాలు జరగటం ఇదే ప్రథమమని వివరించింది. ఈ నెల చివరి నాలుగు రోజుల్లోనే రూ. 545 కోట్ల మద్యం అమ్ముడైంది. గత ఏడాది డిసెంబర్‌లో రూ. 2,764 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఇవాళ ఒక్కరోజే రూ.104 కోట్ల మేర అమ్మకాలు జరిగినట్టు వివరించింది. ఈ అర్ధరాత్రి 12 గంటలకు మద్యం అమ్మకాలకు ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే. మరోవైపు బార్లు, పబ్బుల్లో అర్ధరాత్రి ఒంటిగంట వరకు మద్యం సరఫరా చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం
వీలు కల్పించింది .
undefined
అటు, ఏపీ సర్కార్ కూడా మందుబాబులకు మంచి కిక్కు ఇచ్చే న్యూస్ చెప్పింది. ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో ప్రీమియం బ్రాండ్ల మద్యాన్ని అందుబాటులో తెచ్చి .. మద్యం సేల్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మద్యం అమ్మకాలు అనూహ్యరీతిలో పుంజుకున్నాయి. నూతన సంవత్సర వేడుకల కోసం పెద్దఎత్తున కొనుగోళ్లు చేసేందుకు మందుబాబులు తరలిరావడంతో వైన్ షాపుల వద్ద విపరీతమైన రద్దీ ఏర్పడింది. మద్యాన్ని ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్‌కు చెందిన రిటైల్ ఔట్‌లెట్లలో అమ్ముతున్నారు. బార్లు, వాక్ ఇన్ స్టోర్లలో ప్రీమియం బ్రాండ్లు విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో ట్యాక్స్ పేయర్లు పండుగ చేసుకుంటున్నారు. ఇదే అసలైన.. న్యూ ఇయర్ గిప్ట్ అని మందుబాబులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా న్యూ ఇయర్ అంటేనే.. సంబరాలు.. మద్యం ఏరులై పారుతోంది. మరి ముఖ్యంగా.. నేడు అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం అమ్మకాలకు ప్రభుత్వం అనుమతి నిచ్చింది. దీనితో విక్రయాలు మరింత పెరగొచ్చని తెలుస్తోంది.
మరోవైపు .. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పోలీసులు న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు అమలు చేస్తున్నారు. హైదారాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. న్యూ ఇయర్ వేడుకల్లో మాస్క్ తప్పని సరి చేసింది. లేనివారికి రూ.1,000 జరిమానా విధించనున్నారు. ఈ వేడుకలకు హాజరు కావాలంటే తప్పనిసరిగా.. రెండు డోసుల టీకా తీసుకున్న వారిని మాత్రమే వేడుకలకు అనుమతించనున్నారు. ముందస్తు అనుమతి తీసుకున్న వారికి మాత్రమే పార్టీల నిర్వహణకు అనుమతినిస్తామని కూడా తేల్చి చెప్పారు. అలాగే.. బహిరంగ ప్రదేశాల్లో డీజేలు పెట్టరాదని తెలిపింది. ఈ క్రమంలో ట్రాఫిక్ నిబంధనలను కఠిన తరం చేసింది. మద్యం తాగి వాహనం నడిపితే రూ.10 జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష విధించనున్నట్లు కూడా హెచ్చరించింది. భౌతిక దూరం పాటిస్తూ.. అన్ని రకాల జాగ్రత్తలతో న్యూ ఇయర్ వేడుకల జరుపుకోవాలని సూచించింది.