ఎంపీలతో కేసీఆర్ భేటీ: పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాంపై చర్చ

Published : Jan 30, 2022, 05:01 PM IST
ఎంపీలతో కేసీఆర్ భేటీ: పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాంపై  చర్చ

సారాంశం

తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం నాడు ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాంపై పార్టీ ఎంపీలకు  దిశానిర్ధేశం చేశారు.

హైదరాబాద్: తెలంగాణ సీఎం KCR ఆదివారం నాడు ప్రగతి భవన్ లో  ఎంపీలతో భేటీ అయ్యారు. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ పార్టీ ఎంపీలకు దిశానిర్ధేశం చేయనున్నారు.
Parliament బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుండి ప్రారంభం కానున్నాయి. Budget సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై TRS ఎంపీలకు కేసీఆర్ దిశానిర్ధేశం చేయనున్నారు.

Telangana రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడకుండా పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని నిలదీయాలని   టీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ సూచించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కూడా వరి ధాన్యం కొనుగోలు అంశంపై  పార్లమెుంట్ ఉభయ సభలను టీఆర్ఎస్ స్ధంభింపజేసింది. 

రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధుల విషయంలో టీఆర్ఎస్ నాయకత్వం కేంద్రాన్ని నిలదీయనుంది. రాష్ట్రానికి రైల్వేల లైన్ల విషయంలో కేంద్రీం వివక్ష చూపుతుందని కూడా టీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. అయితే ఈ విమర్శలను కేంద్రం ఖండించింది. ఇటీవలనే ఈ విషయమై కేంద్ర మంత్రి Kishan Reddy స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోని కారణంగానే రాష్ట్రంలో రైల్వే లైన్ల విషయంలో ఆలస్యం జరిగిందని కిషన్ రెడ్డి వివరించారు.ఈ విషయమై ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు.

Kaleshwaram ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించకపోవడంపై కూడా కేసీఆర్ సర్కార్ కేంద్రంపై గుర్రుగా ఉంది. మరో వైపు ఒక్క నవోదయ స్కూల్ కూడా తెలంగాణకు కేటాయించని విషయాన్ని టీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు.వరి ధాన్యం కొనుగోలు అంశాన్ని కూడా మరోసారి టీఆర్ఎస్ నేతలు పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించనున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Padma Awards 2026 : తెలంగాణకు 7, ఏపీకి 4 పద్మ అవార్డులు.. ఆ 11 మంది ఎవరంటే?
Nampally Fire Breaks Out: ఘటనా స్థలాన్ని పరిశీలించిన MLA రాజాసింగ్ | Asianet News Telugu