KCR : కొడుకు, కూతురు కాదు అంతా అల్లుడే..! కాళేశ్వరం కమీషన్ విచారణలో కేసీఆర్ వెంటున్నదీ అతడే

Published : Jun 11, 2025, 12:09 PM ISTUpdated : Jun 11, 2025, 01:58 PM IST
KCR And Harish Rao

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం కమీషన్ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ సమయంలో ఆయనవెంట కూతురు కవిత, కొడుకు కేటీఆర్ కార్యాలయంలోకి వెళ్లలేదు… ఎవరు వెళ్లారో తెలుసా? 

KCR : గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన భారీ నీటిపారుదల ప్రాజెక్ట్ కాళేశ్వరం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ముందునుండే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పేరట భారీ అవినీతి జరుగుతోందనే ఆరోపణలు ఉండేవి.. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుతో దీనిపై మరింత రచ్చ మొదలయ్యింది. చివరకు మాజీ సీఎం కేసీఆర్ విచారణకు హాజరయ్యే పరిస్థితి వచ్చింది. 

బుధవారం అంటే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన జస్టిస్ పిసి ఘోష్ కమీషన్ ముందు మాాజీ సీఎం హాజరయ్యారు.  హైదరాబాద్ లోని బిఆర్కే భవన్ లో కాళేశ్వరం కమీషన్ చీఫ్ జస్టిస్ పిసి ఘోష్ బిఆర్ఎస్ అధినేతను విచారించారు.  

కేసీఆర్ విచారణ నేపథ్యంలో బిఆర్కే భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు. ముందే ఈ పరిస్థితిని అంచనా వేసిన పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. అయినప్పటికి బిఆర్కే భవన్ మెయిన్‌ గేట్‌ దగ్గరకు చేరుకున్న బీఆర్‌ఎస్ కార్యకర్తల ఆందోళనకు దిగారు. తమ నాయకుడు కేసీఆర్‌కు మద్దతుగా… కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నంచేసారు. కానీ వారిని పోలీసులు అడ్డుకున్నారు.

ఆందోళనల నేపథ్యంలో బిఆర్కే భవన్ వైపు వెళ్లే రోడ్లను మూసివేసారు... ఆందోళన చేపట్టిన బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని అక్కడినుండి తరలించారు పోలీసులు. కేవలం విచారణకు హాజరయ్యే కేసీఆర్ తో పాటు ముందుగానే కమీషన్ నుండి అనుమతి తీసుకున్నవారిని మాత్రమే బిఆర్కే భవన్ లో అనుమతిస్తున్నారు. 

ఇలా కేసీఆర్ వెంట కేవలం 9 మంది నాయకులు మాత్రమే బిఆర్కే భవన్ లోకి వెళ్లారు.. వీరిలో మాజీ మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌ రెడ్డి, పద్మారావు గౌడ్‌, మహమూద్‌ అలీ ఉన్నారు. అలాగే బిఆర్ఎస్ నాయకులు వద్దిరాజు రవిచంద్ర, మధుసూదనాచారి, లక్ష్మారెడ్డి, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ లు కూడా కేసీఆర్ వెంట ఉన్నారు.

 

 

బిఆర్కే భవన్ వద్ద ఉద్రిక్తత 

కేసీఆర్ విచారణ నేపథ్యంలో హైదరాబాద్ బిఆర్కే భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నారు. తమ నాయకుడిని జస్టిస్ పిసి ఘోష్ కమీషన్ విచారణకు హాజరుకావాలని నోటిసులిస్తేనే బిఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి.. అలాంటిది ఇప్పుడు ఏకంగా ఆయన విచారణకు హాజరయ్యారు. దీంతో బిఆర్కే భవన్ వద్దకు భారీగా చేరుకున్న బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

బిఆర్కే భవన్ పరిసరాలు కేసీఆర్, బిఆర్ఎస్ పార్టీకి అనుకూల నినాదాలతో దద్దరిల్లాయి. అలాగే సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేసారు. బిఆర్కే భవన్ లోకి చొచ్చుకెళ్ళేందుకు బిఆర్ఎస్ నాయకులు ప్రయత్నించారు.

కేసీఆర్ బిఆర్కే భవన్ కు చేరుకోగానే బిఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు మరింత పెరిగాయి. దీంతో భారీగా మొహరించిన పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేయగా తోపులాట జరిగింది. పరిస్థితి చేయిదాటుతుండటంతో అప్రమత్తమైన పోలీసులు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని అక్కడినుండి తరలించారు. బీఆర్కే భవన్‌ వైపు వెళ్లే రోడ్లను మూసివేసారు పోలీసులు.. అనుమతి ఉన్నవారికి మినహా ఇతరులెవ్వరినీ అనుమతించలేదు.

 

 

ఎర్రవెల్లి ఫాంహౌస్ ఆసక్తికర పరిణామం 

కేసీఆర్ విచారణ నేపథ్యంలో ఎర్రవెల్లి ఫాంహౌస్ లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తాను తండ్రికి రాసిన లేఖ లీక్ కావడంతో కవిత బిఆర్ఎస్ కు దూరం జరిగిన విషయం తెలిసింది. సొంత సోదరుడితో రాజకీయంగా విబేధించిన ఆమె సొంతంగా తెలంగాణ జాగృతి ద్వారా రాజకీయాలు చేస్తున్నారు. ఇలా కల్వకుంట్ల కుటుంబంలో విబేధాలు బైటపడ్డాయి.

అయితే తాజా రాజకీయ పరిణామాల తర్వాత మొదటిసారి తండ్రి కేసీఆర్ ను కలిసారు కవిత. భర్తతో కలిసి ఉదయమే హైదరాబాద్ నుండి ఎర్రవల్లి ఫాంహౌస్ కు చేరుకున్న కవిత తండ్రితో కొద్దిసేపు మాట్లాడారు.

అయితే కాళేశ్వరం కమీషన్ ముందు విచారణకు హారజయ్యేందుకు హైదరాబాద్ బయలుదేరాల్సి ఉండటంతో కూతురితో కేసీఆర్ ఎక్కువసేపు మాట్లాడలేకపోయినట్లు తెలుస్తోంది. కేవలం ఈ విచారణ గురించే ఇద్దరూ మాట్లాడుకున్నట్లు సమాచారం. తండ్రి ఫాంహౌస్ నుండి బయలుదేరి వెళ్లిపోయాక కవిత దంపతులు కూడా అక్కడినుండి వెళ్లిపోయారు.

కేసీఆర్ వెంటే హరీష్ రావు

కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు వ్యవహరించారు. ఆయనే దగ్గరుండి కాళేశ్వరం పనులు చూసుకున్నారు. ఆ తర్వాత ఆయన ఆర్థిక మంత్రిగా కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు చూసుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే హరీష్ రావు జస్టిస్ పిసి ఘోష్ కమీషన్ విచారించింది. ఆయనకంటే ముందు ఆర్థికమంత్రిగా పనిచేసిన ప్రస్తుత బిజెపి ఎంపీ ఈటల రాజేందర్ ను కూడా కాళేశ్వర కమీషన్ విచారించింది.

విచారణకు హాజరయ్యేముందు ఇప్పటికే విచారణను ఎదుర్కొన్న హరీష్ రావుతో కేసీఆర్  పలుమార్లు సుదీర్ఘ చర్చలు జరిపారు. తాజాగా కమీషన్ ముందు విచారణకు వెళుతూ హరీష్ రావునే వెంట తీసుకెళ్లారు కేసీఆర్. కొడుకు కేటీఆర్, కూతురు కవిత ఆయనవెంట లేరు. కవిత ఫాంహౌస్ లోనే తండ్రిని కలవగా.. కేటీఆర్ బిఆర్ఎస్ శ్రేణులతో కలిసి బిఆర్కే భవన్ బయటే ఉన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌