భద్రాచలంలో వరద ముంపు బాధితులతో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఆ తర్వాత ఆయన ఐటీడీఏ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. వరద ముంపు బాధితులకు శాశ్వత కాలనీలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు సీఎం.
భద్రాచలం: Bhadrachalam ముంపు బాధితులకు శాశ్వత కాలనీలు నిర్మిస్తామని తెలంగాణ సీఎం KCR హామీ ఇచ్చారు. భద్రాచలం పట్టణంలో వరద పరిస్థితిపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం నాడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష తర్వాత సీఎం కేసీఆర్ మాట్లాడారు. వరదలు వచ్చినప్పుడల్లా భద్రాచలం వాసులు ముంపునకు గురికావడం బాధాకరమని కేసీఆర్ అన్నారు. శాశ్వత కాలనీల నిర్మాణం కోసం ఎత్తైన ప్రదేశాలను గుర్తించాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు.
భద్రాచలం వద్ద గోదావరికి భారీగా వరద వచ్చినప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకున్నందుకు సీఎం అభినందించారు. వరద వచ్చినప్పుడల్లా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని తిరిగే పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకొంటామన్నారు.
undefined
also read:భద్రాచలానికి చేరుకున్న సీఎం కేసీఆర్: గోదావరికి పూజలు
కడెం ప్రాజెక్టుకు ఏనాడు రాని రీతిలో 5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందన్నారు.ఈ ప్రాజెక్టును దేవుడే కాపాడినట్టుగా కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఇతర దేశాలకు చెందిన వారు మన దేశంలో క్లౌడ్ బరస్ట్ చేస్తున్నారనే ప్రచారం కూడా ఉందన్నారు. గతంలో కాశ్మీర్ లోని లడ్డాఖ్, ఆ తర్వాత ఉత్తరాఖండ్, ప్రస్తుతం గోదావరిపై క్లోడ్ బరస్ట్ చేశారనే అనుమానాలు కూడా ఉన్నాయన్నారు. దీని వెనుక వీదేశీ శక్తుల ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తం చేశారు. క్లోడ్ బరస్ట్ అనే కొత్త పద్దతి వచ్చిందని చెబుతున్నారన్నారు. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు.
భధ్రాచలం, బూర్గుంపహాడ్ 25 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్టుగా చెప్పారు. ఈ నెల 29వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుందన్నారు. దీంతో పునరావాస కేంద్రాల్లో ఉన్నవారిని అత్యవసరంగా ఇళ్లకు తరలించవద్దని సీఎం ఆదేశించారు. వరద ముంపు బాధిత కుటుంబాలకు రూ. 10 వేల చొప్పున ఆర్ధిక సహాయం అందిస్తామని కేసీఆర్ ప్రకటించారు. వచ్చే రెండు మాసాలు ప్రతి కుటుంబానికి 20 కిలోల బియ్యం ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు.
సుభాష్ నగర్, ఎఎంసీ కాలనీలు, కొత్త కాలనీల వాసులను ఇక్కడి నుండి తరలించాలని సీఎం కోరారు. వీరి కోసం వెయ్యి కోట్లతో శాశ్వతంగా భవనాలు నిర్మిస్తామని కేసీఆర్ తెలిపారు. ఈ విషయమై సీఎస్ సోమేష్ కుమార్ చర్యలు తీసుకొంటారని చెప్పారు. పినపాక, భద్రాచలం ప్రాంతాల్లో శాశ్వత కాలనీలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ కోరారు. అంటు వ్యాధులు వ్యాపించకుండా వైద్య ఆరోగ్య శాఖాధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు.
పినపాక, భద్రాచలం, బూర్గుంపహాడ్ మండలాల్లో ముంపునకు గురైన ప్రాంతాల్లో ఉన్నతాధికారులు పర్యటించి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.భద్రాచలం వద్ద వరద సహాయక చర్యలపై ఖమ్మం కలెక్టర్ సహాయం కూడ తీసుకోవాలన్నారు. భధ్రాచలం దిగువన ఉన్న ఏపీ సరిహద్దున ఉన్న తెలంగాణ ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయమై అవసరమైతే ఏపీ అధికారులతో మాట్లాడుతానని కేసీఆర్ హామీ ఇచ్చారు.
భద్రాచలం పట్టణ కాంటూరు లెవల్స్ ను పరిగణలోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. సీతారాముల స్వామి ఆలయం ముంపునకు గురికాకుండా శాశ్వత చర్యలు చేపడతామన్నారు.భద్రాచలం సీతారాముల పుణ్యక్షేత్రాన్ని ముంపు నుంచి రక్షించి, అభివృద్ధి చేస్తామని చెప్పారు.
సీతమ్మ పర్ణశాలను కూడా వరద నుంచి కాపాడేందుకు చర్యలు తీసుకుంటామన్నారు..ఇంకా వర్షాల ముప్పు పోలేదని సీఎం చెప్పారు. ఈ నెలాఖరుదాకా వానలు కొనసాగుతాయన్నారు.వాగులు వంకలు పొంగుతున్నయన్నారు.చెరువులు, కుంటలు నిండిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
వర్షాలు తగ్గాయని ప్రజలు అలక్ష్యం వహించవద్దని సీఎం సూచించారు.దుమ్మగూడెం చర్ల మండలాల్లో నీటిపారుదలకు సంబంధించిన అంశాలు తన దృష్టికి వచ్చాయన్నారు. మొండికుంట వాగు, పాలెం వాగు బ్యాలెన్స్ పనులను పూర్తి చేస్తామని తెలిపారు.రైతుల పంటలు నీట మునిగాయి. సమీక్షించి తగు సహాయం అందిస్తామన్నారు.
శనివారం నాడు రాత్రి వరంగల్ లోనే సీఎం కేసీఆర్ బస చేశారు. ఆదివారం నాడు ఉదయం వరంగల్ నుండి నేరుగా ప్రత్యేక బస్సులో కేసీఆర్ భద్రాచలం పట్టణానికి చేరుకున్నారు మార్గమధ్యలోని Godavari వరద ముంపు ప్రాంతాలను పరిశీలించుకుంటూ భద్రాచలం పట్టణానికి చేరుకున్నారు. భద్రాచలం పట్టణంలో ప్రవేశించడానికి ముందే గోదావరి నదిపై నిర్మించిన బ్రిడ్జిపై నుండి కేసీఆర్ గంగమ్మకు పూజలు చేశారు. శాంతించాలని గంగమ్మను కోరుకున్నారు.
గంగమ్మకు పూజలు చేసిన తర్వాత భద్రాచలం పట్టణంలోకి వరద నీరు ప్రవేశించకుండా నిర్మించిన కరకట్టను పరిశీలించారు సీఎం కేసీఆర్. వరద బాధితులకు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో బాధితులతో కేసీఆర్ మాట్లాడారు. వరద బాధితులకు అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. కరకట్ట వద్ద వరద ఎన్ని అడుగులకు చేరింది. కరకట్ట ఎక్కడ బలహీనంగా ఉంది, ఎక్కడ బలంగా ఉందనే విషయాలపై కూడా సీఎం ఆరా తీశారుఅనంతరం సీఎం ఐటీడీఏ కార్యాలయంలో సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.