ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి.. ఆలయం వద్ద కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు..

Published : Jul 17, 2022, 12:01 PM IST
ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి.. ఆలయం వద్ద కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు..

సారాంశం

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈరోజు తెల్లవారుజామున మంత్రి తలసాని శ్రీనివాస్ కుటుంబ సభ్యులు అమ్మవారికి తొలి భోనం సమర్పించారు. 

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈరోజు తెల్లవారుజామున మంత్రి తలసాని శ్రీనివాస్ కుటుంబ సభ్యులు అమ్మవారికి తొలి భోనం సమర్పించారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శించుకోవడానికి పలువురు ప్రముఖులు, పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివస్తున్నాయి. అయితే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం దగ్గర ఏర్పాట్లపై కాంగ్రెస్ నేతల మండిపడ్డారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ రోజు ఉదయం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్, అంజన్ కుమార్ యాదవ్‌లు అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు వచ్చారు. 

ఆ సమయంలో కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయమా? టీఆర్ఎస్ కార్యాలయమా? అంటూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. అమ్మవారి దర్శనం అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు విరుద్దమైన నిర్ణయాలను తీసుకుంటుందని విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ప్రకృతి విపత్తుల నుంచి అమ్మవారు ప్రజలను కాపాడుకుంటుందని అన్నారు. దేవుడికి అందరికి సమానంగా ఉండాలని అన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!
Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా