ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 10సీట్లు కూడా రావు: డీకే అరుణ

By rajesh yFirst Published Sep 6, 2018, 6:58 PM IST
Highlights

ఆపధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత మాజీమంత్రి డీకే అరుణ మండిపడ్డారు. ఎవరి కోసం తెలంగాణ ప్రభుత్వాన్ని రద్దు చేశారో ప్రజలకు తెలియజెయ్యాలని డిమాండ్ చేశారు. కుమారుడిని సీఎంగా చేసేందుకు రద్దు చేశారా,సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోతారని భయంతో చేశారా లేక తెలంగాణ ప్రజల కోసం చేశారా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రద్దైనందుకు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని, ఇలాంటి పాపిష్టి పాలన నుంచి విముక్తి కల్పించారంటూ సంబరాలు చేసుకుంటున్నారన్నారు. 
 

హైదరాబాద్: ఆపధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత మాజీమంత్రి డీకే అరుణ మండిపడ్డారు. ఎవరి కోసం తెలంగాణ ప్రభుత్వాన్ని రద్దు చేశారో ప్రజలకు తెలియజెయ్యాలని డిమాండ్ చేశారు. కుమారుడిని సీఎంగా చేసేందుకు రద్దు చేశారా,సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోతారని భయంతో చేశారా లేక తెలంగాణ ప్రజల కోసం చేశారా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రద్దైనందుకు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని, ఇలాంటి పాపిష్టి పాలన నుంచి విముక్తి కల్పించారంటూ సంబరాలు చేసుకుంటున్నారన్నారు. 

ప్రభుత్వాన్ని రద్దు చేసిన కేసీఆర్ ఎందుకు ఆపధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలి అనుకుంటున్నారో స్పష్టం చెయ్యాలన్నారు. బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకుని ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వేలో టీఆర్ఎస్ 100 సీట్లు గెలుస్తాది అని చెప్పుకుంటున్న కేసీఆర్ ఎందుకు ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. 

మాయమాటలతో ప్రజలను మోసం చేసిన కేసీఆర్ తెలంగాణ చరిత్రలో ఓ బఫూన్ అని అభిప్రాయపడ్డారు. ఉద్యమనేతగా ఒకసారి అవకాశం కల్పించిన ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడు ఇంటికి పంపుదామా అన్నట్లుగా ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. 

click me!