తెలుగు సినీ ప్రేక్షకులకు ఇది పండగ రోజు.. ఆర్‌ఆర్‌ఆర్ టీమ్‌కు కేసీఆర్, కేటీఆర్‌ల అభినందనలు..

Published : Mar 13, 2023, 11:06 AM IST
తెలుగు సినీ ప్రేక్షకులకు ఇది పండగ రోజు.. ఆర్‌ఆర్‌ఆర్ టీమ్‌కు కేసీఆర్, కేటీఆర్‌ల అభినందనలు..

సారాంశం

ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలోని నాటు నాటు  సాంగ్‌ను ఆస్కార్ వరించింది. ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ‘నాటు నాటు’ పాట పాట ఆస్కార్ సొంతం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. దీంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర బృందానికి తమ అభినందనలు తెలియజేస్తున్నారు. 

ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలోని నాటు నాటు  సాంగ్‌ను ఆస్కార్ వరించింది. ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ‘నాటు నాటు’ పాట పాట ఆస్కార్ సొంతం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. దీంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర బృందానికి తమ అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు చిత్ర బృందానికి అభినందనలు తెలియజేశారు. ‘‘ఆర్‌ఆర్‌ఆర్ టీమ్‌కు అభినందనలు. ఆస్కార్ ద్వారా మీరు భారతీయ, తెలుగు చలనచిత్ర పరిశ్రమను గర్వించేలా చేసారు’’ అని గవర్నర్ తమిళిసై ట్వీట్ చేశారు. 

ఆర్ఆర్ఆర్‌ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌ ఆస్కార్‌ సాధించడంపై సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. విశ్వ సినీ యవనికపై తెలుగు సినిమా సత్తా చాటుతూ, ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ ను గెలుచుకోవడం తెలుగువారిగా మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. ఆస్కార్ పొందిన నాటు నాటు పాటలో పొందు పరిచిన పదాలు తెలంగాణ సంస్కృతికి,  తెలుగు ప్రజల రుచి అభిరుచికి, ప్రజా జీవన వైవిధ్యానికి అద్దం పట్టాయని అన్నారు. 


తెలుగు భాషలోని మట్టి వాసనలను, ఘాటును, నాటు పాట ద్వారా గొప్పగా వెలుగులోకి తెచ్చిన రచయిత, నాటి ఉమ్మడి వరంగల్ నేటి జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చల్లగరిగె గ్రామ బిడ్డ చంద్రబోస్‌ను సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, దర్శకుడు రాజమౌళి, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, నటులు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, సినిమా నిర్మాత డీవీవీ దానయ్య, ఇతర సాంకేతిక సిబ్బందికి కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. 

హలీవుడ్‌కు తీసిపోని విధంగా తెలుగు చిత్రాలు రూపొందడం గొప్ప విషయమని అన్నారు. ఆస్కార్ అవార్డుతో  తెలంగాణ కేంద్రంగా, హైదరాబాద్ గడ్డమీద దినదినాభివృద్ధి చెందుతున్న తెలుగు సినిమా పరిశ్రమ కీర్తి దిగంతాలకు వ్యాపించిందని అన్నారు. ఈ అవార్డు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా.. తెలుగు, ద్రావిడ భాషలకు, యావత్తు భారత దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సినీ ప్రేక్షకులకు ఇది పండుగ రోజని అన్నారు. తెలుగు సినిమా పరిశ్రమ ఎదుగుదలకు తెలంగాణ ప్రభుత్వ కృషి ఫలించిందని అన్నారు. ఆస్కార్ అవార్డు స్ఫూర్తితో తెలుగు సినిమా పరిశ్రమ భవిష్యత్తులోనూ ఇదే ఒరవడిని కొనసాగించాలని కేసీఆర్ ఆకాంక్షించారు. 

నాటు నాటు సాంగ్‌ను ఆస్కార్ వరించిన సందర్భంగా ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర యూనిట్‌‌కు కేటీఆర్ అభినందనలు తెలియజేశారు. నాటు నాటు, ఆర్‌ఆర్‌ఆర్ సాధించిన గౌరవాన్ని సెలబ్రేట్ చేసుకోవడంలో కోట్లాది మంది భారతీయులతో తాను కూడా కలిసి ఉన్నానని తెలిపారు.. చరిత్ర సృష్టించిన కీరవాణి, చంద్రబోస్‌లకు కుడోస్ అని పేర్కొన్నారు. భారతదేశం గర్వపడేలా చేసిన అద్భుతమైన కథకుడు, మ్యాన్‌ ఆఫ్ ది మూమెంట్ రాజమౌళి, సోదరులైన సూపర్ స్టార్స్ రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లతో పాటు నాటు నాటు పాటకి సహకరించిన ప్రతి ఒక్కరూ చేసిన అద్భుతమైన పనికి అభినందనలు తెలుపుతున్నట్టుగా పేర్కొన్నారు. ‘‘టేక్ ఏ బో.. కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్, ప్రేమ్ రక్షిత్..’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. 

 

నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ అవార్డ్ లభించడం పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హర్షం వ్యక్తంచేశారు. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్ ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. నటులు రామ్ చరణ్,  జూనియర్ ఎన్టీఆర్‌, డైరెక్టర్ రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, రచయిత చంద్రబోస్, ఇతర చిత్ర యూనిట్ సభ్యులకు తెలంగాణ ప్రభుత్వం తరపున శుభాకాంక్షలు చెబుతున్నట్టుగా తెలిపారు. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్‌తోపాటు పాటు పలు పురస్కారాలను అందుకున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం చరిత్రలో మొదటిసారి ఆస్కార్ అవార్డ్ అందుకున్న తెలుగు సినిమా కావడం ఎంతో గర్వకారణమని అన్నారు. ఆస్కార్ అవార్డ్‌తో తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతి విశ్వవ్యాప్తమైందని పేర్కొన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?