Kavitha : ఆ డబ్బులు కట్టకుంటే.. రేవంత్ సర్కార్ కు డిఫాల్టర్ గా ప్రకటిస్తారట : కవిత సంచలనం

Published : Jun 26, 2025, 07:01 PM ISTUpdated : Jun 26, 2025, 07:11 PM IST
Kalvakuntla Kavitha

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ అప్పుల వల్ల రాష్ట్ర పరువుపోయే పరిస్థితి వచ్చిందన్నారు. 

Kalvakuntla Kavitha : తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై జాగృతి అధ్యక్షురాలు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేాశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు ఏకంగా 2 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం తెచ్చిన అప్పులకు వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నారని కవిత ఆరోపించారు.

 ఆర్ఈసి సంస్థ డబ్బులు కట్టడం లేదని రాష్ట్ర ప్రభుత్వానికి 2024లో లేఖ రాసిందని కవిత గుర్తుచేశారు. ఇప్పుడు జూన్ 28లోపు కట్టాల్సిన రూ.1320 కోట్లు కట్టాలని ఈ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి మరో లేఖ రాసిందన్నారు. డబ్బులు కట్టలేకపోతే ప్రభుత్వాన్ని డిఫాల్ట్ గా చూపుతామని హెచ్చరించిందని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.

రెండేళ్లు కూడా గడవకముందే రెండు లక్షల కోట్లు అప్పులు చేసికూడా కనీసం పింఛన్లు కూడా ఇవ్వడం లేదని కవిత ఆరోపించారు. మహాలక్ష్మి పథకం కూడా అమలుకు నోచుకోవడం లేదన్నారు. మరి తెచ్చిన అప్పులు ఏం చేస్తున్నారు? రాష్ట్ర ఆదాయం ఎక్కడికి పోతోంది? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో తెచ్చిన రెండు లక్షల కోట్లు దేనికి ఖర్చు చేసారో శ్వేతపత్రం విడుదల చేయాలని రేవంత్ సర్కార్ ను కవిత డిమాండ్ చేశారు.

కేసీఆర్ ఆర్.ఈ.సి వద్ద అప్పులు తెచ్చి ప్రాజెక్టులు కట్టారు... అలాగే ఈ అప్పులను తిరిగి కట్టేసారని కవిత అన్నారు. అందుకే ఆర్ఈసి సంస్థ కేసీఆర్ ప్రభుత్వానికి ఏ గ్రేడ్ ఇచ్చిందన్నారు. ఇదే సంస్థ ఇప్పుడు రేవంత్ ప్రభుత్వాన్ని డిఫాలర్ట్ గా ప్రకటిస్తామని హెచ్చరిస్తోందని కవిత తెలిపారు.

ఆషాడమాసం బోనాల ప్రారంభం సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు కవిత. ఇదే క్రమంలో 18 నెలల పాలనాకాలంలో ఏకంగా రెండు లక్షల కోట్లు అప్పులు తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డికి కూడా శుభాకాంక్షలు అంటూ కవిత ఎద్దేవా చేశారు.

రేవంత్ రెడ్డి ఓ అవినీతి చక్రవర్తి…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భారీ అక్రమాలకు పాల్పడుతున్నారని.. ఈ పనులను మెగా సంస్థతో పాటు మంత్రి పొంగులేటికి చెందిన కంపెనీ దక్కించుకుందన్నారు. ఈ పనులు ప్రారంభం కాకముందే కంపెనీలకు అడ్వాన్స్ లు ఇచ్చారన్నారు. అందుకే రేవంత్ రెడ్డికి అవినీతి చక్రవర్తి అనే బిరుదు ఇస్తున్నామని... ఆయన అవినీతిపై జాగృతి ఆధ్వర్యంలో బుక్ లెట్ ప్రచురించి రాష్ట్రవ్యాప్తంగా పంచుతామన్నారు.

భద్రాచలం రాముడు మునుగుతున్నా తెలంగాణలోని ఎనిమిదిమంది బీజేపీ ఎంపీలు ఎందుకు నోరెత్తడంలేదని కవిత ప్రశ్నించారు. భద్రాచలం వద్ద గతంలో ఏపీలో కలిపిన గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణకు అప్పగించాలని కవిత డిమాండ్ చేశారు.

బనకచర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందే రేవంత్ రెడ్డి

గతేడాది జూలై 6న తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి భేటీ అయ్యారని... ఇది జరిగి సంవత్సరం అవుతుందని కవిత గుర్తుచేశారు. ఈ భేటీలోనే చంద్రబాబు బనకచర్ల కట్టుకోడానికి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కవిత ఆరోపించారు. 

చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా మాట్లాడాలంటే రేవంత్ భయం.. అందుకే బనకచర్లపై సైలెంట్ అయ్యారన్నారు. తెలంగాణకు నష్టం చేసే పనులు కేసీఆర్ కలలో కూడా చేయరని కవిత అన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave Alert : తెలంగాణపై చలి పంజా.. ఈ జిల్లాల్లో వచ్చే పదిరోజులు అత్యల్ప ఉష్ణోగ్రతలు
Medicover Hospitals: అరుదైన అకలేషియా కార్డియాకు POEM చికిత్స.. 61 ఏళ్ల మహిళకు కొత్త జీవితం !