కొత్త మంత్రుల వరుస భేటీలు: మరో పవర్ సెంటర్ కవిత, హరీష్‌కు దెబ్బేనా

First Published Feb 20, 2019, 3:07 PM IST

కేసీఆర్ కేబినెట్‌లో కొత్తగా  మంత్రి పదవులు పొందిన వారంతా నిజామాబాద్ ఎంపీ కవితతో వరుసగా భేటీ అవుతున్నారు

కేసీఆర్ కేబినెట్‌లో కొత్తగా మంత్రి పదవులు పొందిన వారంతా నిజామాబాద్ ఎంపీ కవితతో వరుసగా భేటీ అవుతున్నారు. టీఆర్ఎస్‌లో కేటీఆర్ తర్వాత పార్టీ నేతలు కవితకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పార్టీలో కవిత కేంద్రంగా మరో పవర్ సెంటర్ ఏర్పడిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
undefined
టీఆర్ఎస్‌ ఏర్పడిన తొలినాళ్లలో కేసీఆర్ తర్వాత హరీష్‌రావు కీలకంగా ఉండేవాడు. కేసీఆర్ కొడుకు కేటీఆర్, కూతురు కవిత తెలంగాణ ఉద్యమ సమయంలో విదేశాల్లో ఉండేవారు. ఆ తర్వాత చోటు చేసుకొన్న పరిణామ క్రమంలో వీరిద్దరూ కూడ టీఆర్ఎస్‌లో కీలకంగా మారారు.
undefined
టీఆర్ఎస్‌లో కేసీఆర్ తర్వాత హరీష్‌కు బదులుగా కేటీఆర్ స్థానాన్ని దక్కించుకొన్నారు. మరో వైపు కవిత కూడ మరో పవర్ సెంటర్‌గా మారారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజామాబాద్ జిల్లాతో పాటు కొన్ని సెగ్మెంట్లలో కొందరికీ టిక్కెట్ల కేటాయింపులో కవిత కీలకంగా వ్యవహరించారని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారంలో ఉంది.జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్‌లో డాక్టర్ సంజయ్‌ గెలుపులో కవిత కీలక పాత్ర పోషించారు.
undefined
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ను నియమిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకొన్నారు. ఆ తర్వాత చోటు చేసుకొన్న పరిణామాలు హరీష్‌రావుకు వ్యతిరేకంగా ఉన్నట్టుగా ఆయన వర్గీయులు భావిస్తున్నారు. కేబినెట్‌లో హరీష్‌రావుకు చోటు దక్కకపోవడంపై కూడ ఆయన స్వయంగా వివరణ ఇచ్చారు. తనకు అసంతృప్తి లేదని కూడ ప్రకటించారు.
undefined
కొత్తగా మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా కవితతో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది. మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మంగళవారం నాడు సాయంత్రం కవితతో భేటీ అయ్యారు.
undefined
బుధవారం నాడు మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్‌లు కవితతో భేటీ అయ్యారు. కేబినెట్ విస్తరణకు ముందు రోజు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు కేటీఆర్‌లతో భేటీ అయిన విషయం తెలిసిందే.
undefined
రాజ్ భవన్లో కొత్త మంత్రుల ప్రమాణస్వీకార సమయంలోనే మాజీ మంత్రి హరీష్ రావు కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు తెలిపారు. కానీ, కొత్తగా మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన వారెవరూ కూడ ప్రత్యేకంగా హరీష్‌రావుతో ఇప్పటివరకు భేటీ కాలేదు
undefined
టీఆర్ఎస్‌లో గతంలో కేసీఆర్ తర్వాతి స్థానంలో హరీష్ ఉండేవాడు. కానీ మారిన పరిస్థితుల్లో కేసీఆర్ తర్వాతి స్థానాన్ని కేటీఆర్, కవిత ఆక్రమించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
undefined
click me!