
అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తోన్న తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార (బీఆర్ఎస్), ప్రతి పక్షాలు( బీజేపీ, కాంగ్రెస్) వ్యూహాలు- ప్రతివ్యూహాలు, విమర్శలు- ప్రతి విమర్శల జోరుగా సాగుతున్నాయి. ప్రధాన నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో నాయకుల పాదయాత్రలు కూడా ఊపందకుంటున్నాయి.ఈ ఏడాది చివరిలో తెలంగాణ సహా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరంలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే.
ఈ తరుణంలో అధికార భారత్ రాష్ట్ర సమితి మరోసారి తన అధికారాన్ని నిలబెట్టుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది. అలాగే.. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు.. అధికార బీఆర్ఎస్ ను ఎలాగైనా గద్దె దించి.. అధికార పగ్గాలను చేపట్టాలని యోచిస్తున్నాయి. పెద్ద ఎత్తున ప్రణాళికలను రచిస్తున్నాయి. ఈ తరుణంలో బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో కవిత మాట్లాడుతూ.. ప్రతి పక్ష కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు.
ప్రధానంగా రాహుల్ గాంధీని టార్గెట్ చేసుకుంటూ.. భారత్ జోడో యాత్రపై విమర్శలు గుప్పించారు.వేయి ఎలుకలను తిన్న పిల్లి హజ్ యాత్రకు వెళ్లిందనే సామెత గుర్తుకొస్తోందంటూ రాహుల్ గాంధీపై సెటైర్ వేసింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత .. 62 సంవత్సరాల పాటు దేశాన్ని కాంగ్రెస్సే పరిపాలించిందని, పేదలు, ముస్లింల కోసం ఏం చేశారని నిలదీశారు. గరీబీ హఠావో అంటూ నినదించమే తప్ప పేదలకు చేసిందేమి లేదని విమర్శించారు. ఇంకా ఎన్నిసార్లు కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోగానీ, దేశంలో గానీ ఎలాంటి మార్పులు రాలేదని అన్నారు.
మన దేశంలో రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉందని, అయితే తెలంగాణ ఎలాంటి భయం లేదనీ, మన రాష్ట్రం శక్తివంతమైన నాయకుడి చేతిలో ఉందనీ, రాష్ట్రంలో సమర్థవంతమైన ప్రజాస్వామ్యం ఉందని అన్నారు. కాంగ్రెస్ నేతల ‘తిర్గబాదం థర్మికోద్ధం’ కార్యక్రమంపై కవిత స్పందిస్తూ.. బీఆర్‌ఎస్ కార్యకర్తలు తిరుగుబాటు చేస్తే కాంగ్రెస్ నేతలు భరించలేకపోతున్నారని అన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని ఆమె కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ బీఆర్‌ఎస్ కార్యకర్తలను కలిసిన తీరు చూస్తుంటే ఎమ్మెల్యే షకీల్ గెలుపు ఖాయమన్నారు. పాదయాత్రలో ప్రజల తిరుగులేని ఆదరణ చూసి భావోద్వేగానికి గురయ్యానని తన అనుభవాన్ని పంచుకున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కులం, మతాల పేరుతో వివక్ష చూపకుండా ప్రతి ఇంటికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం పథకాలు అందజేసిందన్నారు. కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం కులం పేరుతో ప్రజలను విడదీస్తుందని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి కులాన్ని గౌరవిస్తుందనీ, ప్రతి కులానికి ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్నామని, ప్రభుత్వం అన్ని కుల వృత్తులను ఆదుకుంటోందని అన్నారు. అలాగే.. తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అన్ని మతాల పండుగలను జరుపుతుందని అన్నారు.
గతంలో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ నేత సుదర్శన్‌రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క చెరువుకు కూడా మరమ్మతులు చేయలేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో బోధన్‌లో 152 చెరువులకు మరమ్మతులు చేశారని ఆమె గుర్తు చేశారు. ఎమ్మెల్సీ కవిత ఇంకా మాట్లాడుతూ సుదర్శన్ రెడ్డి పెద్ద వ్యాపారి అని, షకీల్ ఓ సాధారణ కార్మికుడు, స్కూల్ టీచర్ కొడుకు. బోధన్‌లో సీనియారిటీకి, చిత్తశుద్ధికి మధ్య పోటీ జరగబోతుందని, ఏది కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని కవిత కోరారు.
తెలంగాణ ప్రజల సొంతింటి పార్టీ బీఆర్‌ఎస్ అని, ప్రజలతో అపారమైన అనుబంధం ఉన్న పార్టీ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇతర పార్టీలకు ప్రజలు ఈవీఎంల మాదిరిగా కనిపిస్తారని, కానీ బీఆర్‌ఎస్ పార్టీ మాత్రం ప్రజలే కుటుంబమని భావిస్తుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మాది పేగు బంధమని, ఇతర పార్టీలది ఓటు బంధమని ఆమె అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు రైతులందరి పెండింగ్‌లో ఉన్న రుణాలను మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం రెండు దశల్లో 35 లక్షల మంది రైతులకు 35 వేల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసిందనీ, రైతుబంధు, రుణమాఫీ ద్వారా రైతులను కాపాడుతున్నారనీ, ప్రభుత్వం కార్యక్రమాలను వివరించాలని బీఆర్‌ఎస్ నేతలను ఎమ్మెల్సీ కవిత కోరారు.
కాంగ్రెస్ నేతల ‘తిర్గబాదం థర్మికోద్ధం’ కార్యక్రమంపై కవిత స్పందిస్తూ.. బీఆర్‌ఎస్ కార్యకర్తలు తిరుగుబాటు చేస్తే కాంగ్రెస్ నేతలు భరించలేకపోతున్నారని అన్నారు. తెలంగాణలోని ముస్లింలంతా కారు-కేసీఆర్-సర్కార్ తప్ప మరేమీ ఆలోచించడం లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణలో కేసీఆర్ హయాంలో మతాల మధ్య గొడవలు లేవని, దేశమంతటా ఇదే పరిస్థితి ఏర్పడిందన్నారు.
దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంపై రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని, కేసీఆర్ ఉన్నంత వరకు తెలంగాణలో ప్రజాస్వామ్యానికి ఎలాంటి ప్రమాదం రాదని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ముస్లిం నేతకు ఎమ్మెల్సీ ఇచ్చి ఉప ముఖ్యమంత్రిని చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆమె అన్నారు. ముస్లిం నేతను హోంమంత్రిగా, రెవెన్యూ మంత్రిగా చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ నేననీ, వచ్చే ఎన్నికల్లో షకీల్‌ను మరోసారి భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని ఎమ్మెల్సీ కవిత నియోజకవర్గ ప్రజలను కోరారు.
బుధవారం(ఈరోజు) ఉదయం బోధన్, నిజామాబాద్‌లో ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో భారీ పాదయాత్ర బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుంది. నిజామాబాద్ మాజీ పార్లమెంటు సభ్యుడు బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు పాల్గొన్నారు.