ఈ నెల 16న టీఆర్ఎస్ లోకి కౌశిక్ రెడ్డి..! మరో సీనియర్ నేత కూడా...!!

Published : Jul 13, 2021, 09:26 AM IST
ఈ నెల 16న టీఆర్ఎస్ లోకి కౌశిక్ రెడ్డి..! మరో సీనియర్ నేత కూడా...!!

సారాంశం

కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం, టీఆర్ఎస్ లోకి వెళ్లేందుకు ముహూర్తం నిర్ణయించుకోవడం జరిగిపోయింది. ఈ నెల 16న హైదరాబాద్ లోని టీఆర్ఎస్ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ కండువా కప్పుకోబోతున్నారు. 

కరీంనగర్ : హుజూరాబాద్ కేంద్రంగా కరీంనగర్ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఆది, సోమవారాల్లో చోటు చేసుకున్న పరిణామాలు ఊహించని మలుపులు తిరిగాయి. హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జి పాడి కౌశిక్ రెడ్డి ఫోన్ సంభాషణలు లీక్ అయిన వెంటనే వేగంగా పవులు కదిలాయి.

కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం, టీఆర్ఎస్ లోకి వెళ్లేందుకు ముహూర్తం నిర్ణయించుకోవడం జరిగిపోయింది. ఈ నెల 16న హైదరాబాద్ లోని టీఆర్ఎస్ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ కండువా కప్పుకోబోతున్నారు. 

ఇక ఇటీవల టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, తెలంగాణ అధ్యక్ష పదవికిి రాజీనామా చేసిన ఎల్. రమణ సోమవారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా పార్టీ సభ్యత్వం తీసుకున్న విసయం తెలిసిందే. 

ఇదిలా ఉండగా.. మాజీమంత్రి, బీజేపీ నాయుడు ఇనుగాల పెద్దిరెడ్డి రాజ్యసభ సభ్యుడు కెప్పెన్ లక్ష్మీ కాంతరావుతో భేటీ అయ్యాడు. దీంతో ఇది ప్రాధాన్యతను సంతరించుకుంది. పెద్దిరెడ్డి తండ్రి ఇటీవల మృతి చెందగా, వయో భారంతో కెప్టెన్‌ పరామర్శకు వెళ్లలేదు. ఆదివారం పెద్ద కర్మ ముగిసిన నేపథ్యంలో సోమవారం పెద్దిరెడ్డి స్వయంగా కెప్టెన్‌ ఇంటికి వెళ్లి 2 గంటలపాటు సమావేశమయ్యారు. 

హుజూరాబాద్ నుంచి గతంలో ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన పెద్దిరెడ్డి బీజేపీ తరఫున ఈసారి పోటీ చేయాలని భావించారు. ఈటల బీజేపీలో చేరడంతో ఆ అవకాశం కోల్పోయిన ఆయన బాహాటంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. 

అప్పటినుంచి అంటీముట్టనట్టుగానే బీజేపీతో ఉన్న పెద్దిరెడ్డి త్వరలోనే టీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేసీఆర్ తో గతంలో ఉన్న పరిచయాలు, తాజాగా సహచరుడు ఎల్.రమణ టీఆర్ఎస్ లో చేరుతుండడం వంటి పరిణామాల నేపథ్యంలో పెద్దిరెడ్డి కూడా కారెక్కడం ఖాయమైనట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఆయన ఓ పత్రికతో మాట్లాడుతూ తనను టీఆర్ఎస్ లోకి ఎవరూ ఆహ్వానించలేదని, పిలుపొస్తే ఆలోచిస్తానని అన్నట్టు సమాచారం.

PREV
click me!

Recommended Stories

Real Estate : లక్షల్లో పెట్టుబడి, కోట్లలో లాభం ! హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నెక్స్ట్ డెస్టినేషన్ ఇదే
YCP Leaders Protest Against ABN Weekend Comment Over Controversial Remarks | Asianet News Telugu