సంసారానికి పనికి రావని భార్య హేళన: కామాంధుడి గురించి విస్తుపోయే విషయాలు

Published : Jul 13, 2021, 07:44 AM IST
సంసారానికి పనికి రావని భార్య హేళన: కామాంధుడి గురించి విస్తుపోయే విషయాలు

సారాంశం

కామాంధుడు అభిరామ్ గురించి పోలీసు విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగు చూశాయి. సంసారానికి పనికి రావని భార్య ఎగతాళి చేయడంతో అతను కాామాంధుడిగా మారి చిన్నారులను టార్గెట్ చేస్తున్నట్లు తెలిసింది.

హైదరాబాద్: ఒంటరి మహిళలను, చిన్నారులను లక్ష్యం చేసుకున్న కామాంధుడు అభిరామ్ అలియాస్ అభి (40) విషయంలో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. సంసారానికి పనికి రావంటూ భార్య చేసిన అవహేళనతో అతను కక్ష పెంచుకున్నాడు. కోరిక తీర్చాలని ఒంటరి మహిళల వెంట పడుతూ వచ్చాడు. చిన్నారులను లక్ష్యం చేసుకుని కామవాంఛ తీర్చుకునేవాడు. 

హైదరాబాదులోని జవహర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడాకు చెందిన నాలుగేళ్ల చిన్నారిని అభిరామం ఈ నెల 4వ తేదీన కిడ్నాప్ చేసి మర్నాడు ప్రగతినగర్ నీళ్ల ట్యాంక్ వద్ద వదిలేశాడు. తీవ్రమైన గాయాలతో చిన్నారి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 

ఈ నెల 9వ తేదీన మరో చిన్నారని అపహరించే ప్రయత్నంలో అతను పోలీసులకు చిక్కాడు. అతన్ని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అతన్ని విచారించే క్రమంలో దర్యాప్తు అధికారులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. 

నుదుటిపై తుపాకి పెట్టి కాల్చేయాలని అతను పదే పదే అడుగుతూ వచ్చాడు. కీసర మండలం బండ్లగుడా 60 యార్డ్సు కాలనీలో ఉంటున్న అభి మేస్త్రీగా పనిచేస్తున్నాడు. చీకటి పడితే కామోన్మాదిగా మారేవాడు. దాని నుంచి బయటపడేందుకు డ్రగ్స్ ను అలవాటు చేసుకున్నాడు. అయినా తనలో మార్పు రాలేదని అతని దర్యాప్తు అధికారులకు చెప్పాడు. 

అభి నివాసం చుట్టూ అటవీ ప్రాంతం ఉంటుంది. రాత్రి కాగానే అటవీ మార్గంలో నడుచుకుంటూ జవహర్ నగర్ ప్రాంతాలకు నడుచుకుంటూ వచ్చేవాడినని చెప్పాడు. ఆ ప్రాంతమంతా తెలియడంతో చిన్నారులను కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకుని వచ్చేవాడినని అభిరామ్ దర్యాప్తు అధికారుల వద్ద అంగీకరించాడు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : చలి నుండి ఉపశమనం మూన్నాళ్ల ముచ్చటే.. మళ్లీ గజగజలాడించే చలి, పొగమంచు ఎక్స్ట్రా
Bullet Train India: దూసుకొస్తున్న బుల్లెట్ ట్రైన్.. హైదరాబాద్, అమరావతి రూట్లలో గంటలో ప్రయాణం