హైదరాబాద్ లో కన్నడ యువతి సూసైడ్.... కేబుల్ బ్రిడ్జి పైనుండి దుర్గంచెరువులో దూకి

By Arun Kumar P  |  First Published Jul 14, 2023, 9:59 AM IST

ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వాడికి దూరం కాలేక... అతడిని పెళ్లాడేందుకు తల్లిదండ్రులను ఒప్పించలేక హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జి పైనుండి దూకి ఓ యువతి సూసైడ్ చేసుకుంది. 


హైదరాబాద్ : లవ్ మ్యారేజ్ కు పేరెంట్స్ ఒప్పుకోకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయిన యువతి సూసైడ్ చేసుకుంది. ప్రేమించివాడిని విడిచి వుండలేక... అతడితో పెళ్లికి తల్లిదండ్రులను ఒప్పించలేక తీవ్ర ఒత్తిడిలో ఆమె దారుణ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జి పైనుండి దుర్గంచెరువులోకి దూకి యువతి ఆత్మహత్య చేసుకుంది. 

మాదాపూర్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.  కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లా చించోలి ప్రాంతానికి చెందిన యువతి పాయల్(20) హైదరాబాద్ లో నివాసముంటోంది. ఆరు నెలల క్రితమే నగరానికి వచ్చిన ఆమె ఓ యువకుడిని ప్రేమలో పడింది. పరిచయమైన కొద్దిరోజులకే వారి ప్రేమ పెళ్ళి చేసుకోవాలనే స్థాయికి వెళ్ళింది. ఇద్దరి కుటుంబాలను ఒప్పించి బంధుమిత్రుల సమక్షంలో ఆనందంగా పెళ్ళి చేసుకోవాలని భావించారు. 

Latest Videos

తాను ఓ అబ్బాయిని ప్రేమిస్తున్నాను... అతడినే పెళ్లి చేసుకుంటానని పాయల్ తల్లిదండ్రులకు చెప్పింది. కానీ ఆమె ప్రేమ వివాహానికి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఎంత ప్రయత్నించినా కుటుంబసభ్యులు ఒప్పుకోకపోవడం... వారిని కాదని ప్రియుడిని పెళ్లి చేసుకోలేక గతకొద్దిరోజులుగా తీవ్ర ఒత్తిడికి గురయ్యింది పాయల్.ప్రాణంగా ప్రేమించిన వాడికి ఎక్కడ దూరం అవ్వాల్సివస్తుందోనని ఆందోళనకు గురయిన పాయల్ చివరకు ప్రాణాలు తీసుకోడానికి సిద్దపడింది. 

Read More  వరంగల్ రైల్వే స్టేషన్ లో ప్రమాదం: వాటర్ ట్యాంక్ కూలి ముగ్గురికి గాయాలు

మాదాపైర్ డీమార్ట్ సమీపంలో నివాసముంటున్న పాయల్ గురువారం సాయంత్రం దగ్గర్లోని దుర్గంచెరువు వద్దకు చేరుకుంది. కేబుల్ బ్రిడ్జిపై నడుచుకుంటూ వెళుతూ ఒక్కసారిగా దానిపైనుండి చెరువులోకి దూకేసింది. ఇది గమనించినవారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు డిఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది సాయంతో చెరువులో గాలింపు చేపట్టారు. కానీ రాత్రివరకు పాయల్ ఆచూకీ లభించలేదు. 

రాత్రి కావడంతో గాలించడం నిలిపివేసి శుక్రవారం ఉదయం తిరిగి చేపడతామని అధికారులు తెలిపారు. అయితే బ్రిడ్జి పైనుండి దూకడంతో పాయల్ బురదలో కూరుకుపోయి వుంటుందని భావిస్తున్నారు. నీటమునిగిన పాయల్ చనిపోయి వుంటుందని భావిస్తున్నారు.  

(జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 )  కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.)
 

click me!