ఖర్గే నివాసంలో ముగిసిన భేటీ: రేవంత్ వైపే మొగ్గు, హైద్రాబాద్‌కు డీ.కే.శివకుమార్

By narsimha lode  |  First Published Dec 5, 2023, 2:58 PM IST

తెలంగాణలో సీఎల్పీ నేత ఎంపికపై  కాంగ్రెస్ నాయకత్వం కసరత్తు పూర్తైంది.  ఇవాళ సాయంత్రం  సీఎల్పీ నేత పేరును కాంగ్రెస్ నాయకత్వం ప్రకటించనుంది



హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  నివాసంలో సమావేశం ముగిసింది.  ఈ సమావేశంలో  రాహుల్ గాంధీ,  కేసీ వేణుగోపాల్, కర్ణాటక డిప్యూటీ సీఎం,  మాణిక్ రావు ఠాక్రే తదితరులు భేటీ అయ్యారు. తెలంగాణలో  సీఎల్పీ నేత పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించనుంది.  నిన్న హైద్రాబాద్ లో జరిగిన సమావేశంలో  మల్లికార్జున ఖర్గే కు సీఎల్పీ నేత ఎంపికపై  కాంగ్రెస్ శాసనసభపక్షం తీర్మానం ఆమోదించింది. ఈ తీర్మానం తర్వాత  ఎమ్మెల్యేలతో  విడి విడిగా  సమావేశమై అభిప్రాయాలను కూడ కాంగ్రెస్ పరిశీలకులు సేకరించారు.  ఈ రిపోర్టును కూడ  ఇవాళ సమావేశంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీ. కే. శివకుమార్  మల్లికార్జున ఖర్గేకు సమర్పించారు. ఈ రిపోర్టుపై కూడ  నేతలు చర్చించారు.  

also read:నేడు సీఎం రేసులో ముందున్న అల్లుడు: నాడు వద్దనుకున్న మామ

Latest Videos

undefined

మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన  సమావేశంలో సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డి పేరును  రాహుల్ గాంధీ  సూచించారనే ప్రచారం కూడ సాగుతుంది. ఖర్గే నివాసంలో  అరగంటకు పైగా కాంగ్రెస్ అగ్రనేతలు ఈ విషయమై చర్చించారు.  ఈ సమావేశం నుండి తొలుత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ వెళ్లిపోయారు. వీరిద్దరూ వెళ్లిపోయిన అరగంట తర్వాత  డీ. కే. శివకుమార్ ,మాణిక్ రావు ఠాక్రేలు  సమావేశం నుండి బయటకు వచ్చారు. ఖర్గే నివాసం నుండి  ఈ ఇద్దరు నేతలు  హైద్రాబాద్ కు బయలుదేరారు.మల్లికార్జున ఖర్గే నివాసం నుండి సీల్డ్ కవర్లో  డీ. కే. శివకుమార్  హైద్రాబాద్ కు బయలుదేరారు.  ఇవాళ మరోసారి  కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశంలో  సీల్డ్ కవర్లో ఉన్న పేరును డీ. కే. శివకుమార్ సహా కాంగ్రెస్ పరిశీలకులు  ప్రకటించే అవకాశం ఉంది. 

ఖర్గే నివాసంలో సమావేశానికి ముందే డీ. కే. శివకుమార్ తో  కాంగ్రెస్ పార్టీ  సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి గంట పాటు భేటీ అయ్యారు. తన అభిప్రాయాన్ని మరోసారి డీ.కే. శివకుమార్ ముందుంచారు.  నిన్న కూడ  సీఎల్పీ సమావేశానికి ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ,మల్లు భట్టి విక్రమార్కలు  భేటీ అయ్యారు.

also read:మల్లికార్జున ఖర్గే నివాసంలో సీఎల్పీ నేత ఎంపికపై చర్చ:రాహుల్ సహా కీలక నేతల భేటీ

ఇవాళ ఉదయం కూడ  న్యూఢిల్లీకి వచ్చిన  మల్లు భట్టి విక్రమార్క మాణిక్ రావు ఠాక్రేతో సమావేశమయ్యారు.  తన అభిప్రాయాలను ఠాక్రే ముందుంచారు.  సీఎల్పీ రేసులో కూడ  భట్టి విక్రమార్క ఉన్నారు. తన పాదయాత్రతో పాటు కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడం కోసం  తాను చేసిన కృషిని  కూడ  భట్టి విక్రమార్క ఠాక్రేకు వివరించారు. 

 

 

 

click me!