ఆ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి .. కమ్యూనిస్టులతో పొత్తు లేకపోవడం వల్లే , ఇదొక గుణపాఠం : సీపీఐ నారాయణ

By Siva Kodati  |  First Published Dec 5, 2023, 2:50 PM IST

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చాయనే చెప్పాలి. అధికారంలో వున్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలను కోల్పోవడంతో పాటు ఎన్నో ఆశలు పెట్టుకున్న మధ్యప్రదేశ్‌‌లో ఘోర పరాజయంతో కాంగ్రెస్ నేతలు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఐదు రాష్ట్రాల్లో ఓటమి కాంగ్రెస్‌కు ఒక గుణపాఠం అన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.


ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చాయనే చెప్పాలి. అధికారంలో వున్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలను కోల్పోవడంతో పాటు ఎన్నో ఆశలు పెట్టుకున్న మధ్యప్రదేశ్‌‌లో ఘోర పరాజయంతో కాంగ్రెస్ నేతలు తీవ్ర నిరాశకు గురయ్యారు. తెలంగాణలో దాదాపు పదేళ్ల తర్వాత అధికారంలోకి రావడం, దక్షిణాదిలో తిరిగి పాగా వేయడం మాత్రమే కాంగ్రెస్‌కు ఊరటనిచ్చే అంశం. ఈ నేపథ్యంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. 

ఐదు రాష్ట్రాల్లో ఓటమి కాంగ్రెస్‌కు ఒక గుణపాఠం అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఫలితాలు రాగానే టూరిజం శాఖ కార్యాలయం తగలబడిందని ఆయన ఆరోపించారు. వందల కోట్ల అవీనితి జరిగిందని.. ఇందులో మంత్రి, ఎండీ పాత్ర వుందని సీపీఐ నారాయణ అనుమానం వ్యక్తం చేశారు. కేవలం పరిపాలనా కార్యాలయం మాత్రమే తగలబడటం ఏంటని ఆయన ప్రశ్నించారు. టూరిజం శాఖలో అవకతవకలపై విచారణ చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. కక్ష సాధింపు, అహంకారం, అవినీతితో విసిగిపోయిన ప్రజలు మార్పు కోరుకుటున్నారని ఆయన తెలిపారు. 

Latest Videos

undefined

ALso Read: కాంగ్రెస్‌ను తిప్పికొట్టిన హిందీ బెల్ట్ .. ఉత్తరాదిలో పట్టు సడలనివ్వని బీజేపీ, ‘‘ హస్తం ’’ తప్పెక్కడ చేస్తోంది

ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో కమ్యూనిస్టులకు బలం వుందని.. అక్కడ వారికి సీట్లు ఇవ్వకపోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ ఓడిందని నారాయణ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ వైఖరి వల్లే ఆయా రాష్ట్రాల్లో ఆ పార్టీ ఓటమికి కారణమని, బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మారాలని సీపీఐ నారాయణ అన్నారు. 

click me!