అంబానీ ఇంట పెళ్లిలో కరీంనగర్ ఉత్పత్తులు..  అతిథులకు తెలంగాణ నుంచే అదిరిపోయే రిటర్న్ గిఫ్టులు..

Published : May 23, 2024, 10:01 PM IST
అంబానీ ఇంట పెళ్లిలో కరీంనగర్ ఉత్పత్తులు..  అతిథులకు తెలంగాణ నుంచే అదిరిపోయే రిటర్న్ గిఫ్టులు..

సారాంశం

Karimnagar Silver Filigree: ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ(అనంత్ - రాధిక)ల వివాహ వేడుకలు షూరు అయ్యాయి. ఈ పెళ్లికి వచ్చే అతిథులకు అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వనున్నారు. ఆ రిటర్న్ గిఫ్ట్స్ ను మన కరీంనగర్ లో తయారు చేయిస్తున్నారంట. ఇంతకీ ఆ ప్రత్యేక బహుతులేంటో తెలుసా? 

Karimnagar Silver Filigree: రిలయన్స్ ఇండస్ట్రీస్ యజమాని, ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ (అనంత్ రాధిక)ల వివాహ వేడుకలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ జూలైలో జరగనున్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల వివాహానికి హాజరయ్యే గ్లోబల్ ఎ-లిస్టర్‌లకు అంబానీ కుటుంబం బహుమతిగా ఇచ్చేందుకు అద్భుతమైన బహుమతుల జాబితాలో జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జిఐ) ట్యాగ్ చేసిన కరీంనగర్ వెండి కళాఖండాలు చేరనున్నాయి. 

ఈ ఏడాది మార్చిలో జామ్‌నగర్‌లో జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకకు బిల్ గేట్స్, మార్క్ జుకర్‌బర్గ్, హిల్లరీ క్లింటన్, రిహన్న వంటి ప్రముఖులు హాజరయ్యారు.

కరీంనగర్ హస్తకళల సంక్షేమ సంఘం (SIFCA) సిల్వర్ ఫిలిగ్రీ ఈ హైప్రొఫైల్ వివాహానికి సంబంధించి దాదాపు 400 విలువైన కళాఖండాల కోసం ఆర్డర్‌ను అందుకుంది. అందులో నగల పెట్టెలు, పర్సులు, ట్రేలు, పండ్ల గిన్నెలు మొదలైనవి ఉన్నాయని SIFCA ప్రెసిడెంట్ ఆరోజు అశోక్ తెలిపారు. 

అంబానీ పెళ్లి దాదాపు 400 ఏళ్ల నాటి ఈ పురాతన కళలకు పెద్ద ప్రచారం అవుతుందని, ఆయన క్రియేషన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతులు, ప్రసిద్ధుల ఇళ్లకు చేరుకుంటాయని అశోక్ చెప్పారు. నవంబర్ 2023లో హైదరాబాద్‌లో అరంగేట్రం చేసిన రిలయన్స్ రిటైల్ స్వదేశ్ స్టోర్‌కు SIFCA సరఫరా చేస్తోందని ఆయన చెప్పారు.
 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ