మా దగ్గర బిట్స్ ఫిలానీ... కాంగ్రెస్ లో పల్లి బఠానీ...: కేటీఆర్ మాస్ ట్రోలింగ్ 

By Arun Kumar P  |  First Published May 23, 2024, 3:50 PM IST

అధికారం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నను మాజీ మంత్రి కేటీఆర్ మాస్ ట్రోలింగ్ చేసారు.  


హైదరాబాద్ : తెలంగాణలో ఎలక్షన్ హీట్ తగ్గడం లేదు. గతేడాది చివర్లో అసెంబ్లీ ఎన్నకలతో మొదలైన పొలిటికల్ వార్ ఇంకా కొనసాగుతూనే వుంది. నాయకుల మధ్య మాటలయుద్దం ఆగకుండా సాగుతోంది. తాజాగా పార్లమెంట్ ఎన్నికలు ముగిసింది అనుకుంటుండగానే నల్గొండ-వరంగల్-ఖమ్మం ఉపఎన్నిక వచ్చింది. దీన్ని కూడా ప్రధాన పార్టీలు సీరియస్ గా తీసుకోవడంతో వాడీవేడిగా రాజకీయాలు సాగుతున్నాయి.  

ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో అధికార కాంగ్రెస్ చింతపండు నవీస్ అలియాస్  తీన్మార్ మల్లన్నను బరిలోకి దింపింది. ఇక  బిఆర్ఎస్ ఏనుగుల రాకేష్ రెడ్డి, బిజెపి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని పోటీలో నిలిపింది. ఇప్పటికే వీరంతా నామినేషన్లు దాఖలు చేసి ముమ్మర ప్రచారం చేసుకుంటున్నారు... మే 27 న పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగానే తమ అభ్యర్థిని, కాంగ్రెస్ అభ్యర్థిని పోలుస్తూ ఆసక్తికర కామెంట్స్ చేసారు. 'మా అభ్యర్థి బిట్స్ పిలానీ... అక్కడున్నది పల్లీ బఠాణి' అంటూ కేటీఆర్ చేసిన మాస్ ట్రోలింగ్ తెగ వైరల్ గా మారింది. 

Latest Videos

undefined

 

కేటీఆర్ కామెంట్స్ తర్వాత నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీచేస్తున్న అభ్యర్థుల ఎడ్యుకేషన్ పై చర్చ మొదలైంది. ముఖ్యంగా బిఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి బిట్స్ పిలానీలో చదువుకున్నాడని కేటఆర్ మాటల ద్వారా ప్రజలకు తెలిసింది. 

రాకేష్ రెడ్డి బిట్స్ పిలానీలో మాస్టర్స్ ఇన్ ఫైనాన్స్ మరియు మాస్టర్స్ ఇన్ మేనేజ్ మెంట్ స్టడీస్ చదివారు. కాలేజీ రోజుల్లోనే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న రాకేష్ స్టూడెంట్ యూనియన్ నాయకుడిగా ఎదిగాడు. ఆ తర్వాత కొంతకాలం ఉద్యోగం చేసినా 2013 లో రాజకీయ రంగప్రవేశం చేసాడు. బిజెపి నుండి రాజకీయ ప్రస్థానం ప్రారంభించినా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అతడికి పోటీచేసే అవకాశం దక్కలేదు. దీంతో బిఆర్ఎస్ లో చేరిపోయిన రాకేష్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. 

ఇదిలావుంటే కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్ కూడా కేటీఆర్ అన్నట్లుగా పల్లీ బఠాణి స్థాయి చదువు కలిగినవాడేమీ కాదు. భువనగిరి జిల్లాకు చెందిన మల్లన్న ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎంఏ పొలిటికల్ సైన్స్, జెఎన్టీయు నుండి ఎంబిఏ పూర్తిచేసాడు. అనంతరం పలు మీడియా సంస్థల్లో పనిచేసిన అతడు రాజకీయాల్లో అడుగుపెట్టాడు. తాజాగా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో నిలిచాడు. 


 

click me!