ఉత్తర తెలంగాణ జిల్లాల రాజకీయాలకు కరీంనగర్‌ను గుండెకాయలా భావిస్తారు. ఎం సత్యనారాయణ రావు, సీహెచ్ విద్యాసాగర్ రావు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వంటి ఉద్ధండులు కరీంనగర్ నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిథ్యం వహించారు. తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ కీలకపాత్ర పోషించింది. 1952లో ఏర్పడిన కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో తొలినాళ్లలో కాంగ్రెస్ పార్టీదే హవా. ఆ తర్వాత నెమ్మదిగా బీఆర్ఎస్ కంచుకోటగా మారింది. అయితే బీజేపీ ఇక్కడ చాప కింద నీరులా పుంజుకోవడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 10 సార్లు , ఉపఎన్నికలతో కలిపి బీఆర్ఎస్ నాలుగు సార్లు, బీజేపీ మూడు సార్లు, ఇతరులు నాలుగు సార్లు విజయం సాధించారు. రాష్ట్రంలో అధికారాన్ని సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది.
కరీంనగర్ ప్రస్తావన లేకుండా తెలంగాణ రాజకీయాలు వుండవంటే అతిశయోక్తి కాదు. ఎన్నెన్నో పోరాటాలు పురుడు పోసుకున్న నేల ఇది. ఎందరో ఉద్ధండులను దేశానికి అందించింది కరీంనగర్. ప్రజా ఉద్యమాలు, నక్సల్ ఉద్యమానికి కేంద్రంగా నిలిచింది. రాజకీయంగా చైతన్యం వున్న ఈ జిల్లాలో రోజుకోరకంగా పాలిటిక్స్ మారుతూ వుంటాయి. విలక్షణ తీర్పుతో అంచనాలకు అందరు కరీంనగర్ ఓటర్లు. ఇక్కడి జనాల నాడి అందుకోవడం అంత తేలికకాదు. కమ్యూనిస్ట్, కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్, బీజేపీ, తెలంగాణ ఉద్యమ పార్టీలను ఆదరించిన ఘనత కరీంనగర్ సొంతం.
కరీంనగర్ ఎంపీ (లోక్‌సభ) ఎన్నికల ఫలితాలు 2024 .. వెలమల ఖిల్లా :
పార్టీ ఏదైనా వెలమ సామాజికవర్గానిదే ఇక్కడ ఆధిపత్యం. ఉత్తర తెలంగాణ జిల్లాల రాజకీయాలకు కరీంనగర్‌ను గుండెకాయలా భావిస్తారు. రాష్ట్ర, జిల్లా , స్థానిక రాజకీయాలను వెలమలు ప్రభావితం చేస్తూ వుంటారు. అయితే ఓటింగ్ పరంగా మున్నూరు కాపు, ముస్లింలు కూడా ఇప్పుడిప్పుడే ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. ఎం సత్యనారాయణ రావు, సీహెచ్ విద్యాసాగర్ రావు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వంటి ఉద్ధండులు కరీంనగర్ నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిథ్యం వహించారు. తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ కీలకపాత్ర పోషించింది. ఇక్కడి నుంచి కేసీఆర్ ఎంపీగా పోటీ చేసి.. ఉద్యమాన్ని ఉదృతం చేశారు.
కరీంనగర్ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024 .. కేసీఆర్‌కు సెంటిమెంట్ :
1952లో ఏర్పడిన కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో తొలినాళ్లలో కాంగ్రెస్ పార్టీదే హవా. ఆ తర్వాత నెమ్మదిగా బీఆర్ఎస్ కంచుకోటగా మారింది. అయితే బీజేపీ ఇక్కడ చాప కింద నీరులా పుంజుకోవడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 10 సార్లు , ఉపఎన్నికలతో కలిపి బీఆర్ఎస్ నాలుగు సార్లు, బీజేపీ మూడు సార్లు, ఇతరులు నాలుగు సార్లు విజయం సాధించారు. కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో మొత్తం ఓటర్ల సంఖ్య 16,51,534 మంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 69.4 శాతం ఓటింగ్ నమోదైంది.
ఈ లోక్‌సభ పరిధిలో కరీంనగర్, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల, మానకొండూర్, హుజురాబాద్, హుస్నాబాద్ లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని 7 స్థానాల్లో బీఆర్ఎస్ మూడు చోట్ల, కాంగ్రెస్ నాలుగు చోట్ల విజయం సాధించింది. 2019 పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్‌కు 4,98,276 ఓట్లు.. బీఆర్ఎస్ అభ్యర్ధి బోయినపల్లి వినోద్ కుమార్ 4,08,768 ఓట్లు.. కాంగ్రెస్ అభ్యర్ధి పొన్నం ప్రభాకర్‌కు 1,79,258 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా బీజేపీ 89,508 ఓట్ల తేడాతో కరీంనగర్‌ను కైవసం చేసుకుంది.
కరీంనగర్ ఎంపీ (పార్లమెంట్) ఎన్నికల ఫలితాలు 2024 .. బీఆర్ఎస్, బీజేపీలకి కాంగ్రెస్ షాకిస్తుందా :
రాష్ట్రంలో అధికారాన్ని సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. కరీంనగర్ లోక్‌సభ స్థానాన్ని కాంగ్రెస్ గెలిచి 15 ఏళ్లు గడుస్తోంది. 2009లో చివరిసారిగా హస్తం పార్టీ ఇక్కడ విజయం సాధించింది. ప్రస్తుతం నియోజకవర్గంలో పార్టీ బలంగా వుండటంతో కరీంనగర్ ఎంపీ టికెట్ కోసం ఆశావహుల సంఖ్య భారీగా వుంది. కానీ బీఆర్ఎస్, బీజేపీలను ఎదుర్కోవడం అంత ఆషామాషీ కాదు.
ఈసారి పార్లమెంట్ ఎన్నికలు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు తొలి పరీక్షగా భావిస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీలకు ఎదురు నిలవగలిగే అభ్యర్ధి కోసం కాంగ్రెస్ వెతుకుతోంది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అలిగిరి ప్రవీణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగపతి రావు తనయుడు తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఆశీస్సులు ప్రవీణ్ రెడ్డికే వున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే రాహుల్ గాంధీతో సత్సంబంధాలున్న రుద్ర సంతోష్ కుమార్ సైతం తన ప్రయత్నాలను ఢిల్లీ స్థాయిలో తీవ్రతరం చేశారు.
ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే.. తన కంచుకోటను కాపాడుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్‌కు మరోసారి టికెట్ ఖరారు చేశారు గులాబీ బాస్. గతంలో తాను చేసిన అభివృద్ధి, బీఆర్ఎస్ కేడర్‌ల సాయంతో విజయం తనదేనని వినోద్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ విషయానికి వస్తే.. బండి సంజయ్ కుమార్ ఇక్కడ ఎంపీగా గెలిచి పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. తన వాగ్ధాటి, వ్యూహాలతో బీజేపీని తెలంగాణలో బలోపేతం చేయడంతో పాటు జాతీయ స్థాయిలో కరీంనగర్‌కు గుర్తింపు తీసుకొచ్చారు. మోడీ ఛరిష్మా, సంజయ్ పనితీరు, కార్యకర్తల బలం సాయంతో బీజేపీ ఇక్కడ గెలవాలని చూస్తోంది.