వరంగల్ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024

By Siva Kodati  |  First Published Mar 11, 2024, 8:27 PM IST

తెలంగాణలో రెండో అతిపెద్ద నగరంగా, కాకతీయుల రాజధానిగా చారిత్రక వైభవం వరంగల్ సొంతం. దేశానికి ప్రధానిని అందించిన గడ్డగా.. చివరికి ఆయననే ఓడించిన చరిత్ర ఓరుగల్లుకే చెల్లింది. విస్తారమైన అటవీ ప్రాంతం, సింగరేణి గనులు, గోదావరి గలలు వరంగల్‌ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రత్యేకం. 1952లో కమ్యూనిస్ట్ నేత పెండ్యాల రాఘవరావు వరంగల్ లోక్‌సభ స్థానంతో పాటు హన్మకొండ, వర్ధన్నపేట అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి మూడు చోట్ల విజయం సాధించి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. జైలు నుంచే నామినేషన్ వేసిన రాఘవరావు ఘన విజయం అందుకున్నారు. వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో స్టేషన్ ఘన్‌పూర్, పాలకుర్తి, పరకాల, వర్ధన్నపేట, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిలో స్టేషన్ ఘన్‌పూర్, వర్ధన్నపేట స్థానాలు ఎస్సీ రిజర్వ్‌డ్.


పోరాటాల పురిటిగడ్డ.. ఉద్యమాల ఖిల్లా వరంగల్. తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన ఈ జిల్లా.. ఉత్తర తెలంగాణకు కేంద్రం. తెలంగాణ అంతా ఓ రాజకీయం నడిస్తే.. వరంగల్‌లో మాత్రం అందుకు భిన్నమైన పరిస్ధితులు కనిపిస్తాయి. ఇక్కడి రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరమే. తెలంగాణలో రెండో అతిపెద్ద నగరంగా, కాకతీయుల రాజధానిగా చారిత్రక వైభవం వరంగల్ సొంతం. దేశానికి ప్రధానిని అందించిన గడ్డగా.. చివరికి ఆయననే ఓడించిన చరిత్ర ఓరుగల్లుకే చెల్లింది. విస్తారమైన అటవీ ప్రాంతం, సింగరేణి గనులు, గోదావరి గలలు వరంగల్‌ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రత్యేకం. 

వరంగల్ ఎంపీ (లోక్‌సభ) ఎన్నికల ఫలితాలు 2024 .. పెండ్యాల రాఘవరావు అరుదైన రికార్డ్ :

Latest Videos

ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గమైన వరంగల్‌ 1952లో ఆవిర్భవించింది. తొలినాళ్లలో కాంగ్రెస్, కమ్యూనిస్టులకు కంచుకోటగా వున్న వరంగల్.. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ చేతుల్లోకి వెళ్లింది. ప్రస్తుతం బీఆర్ఎస్‌‌‌కు పెట్టని కోటగా వుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 8 సార్లు, టీడీపీ 5 సార్లు, బీఆర్ఎస్ 3 సార్లు, ఇతరులు రెండు సార్లు గెలిచారు. 1952లో కమ్యూనిస్ట్ నేత పెండ్యాల రాఘవరావు వరంగల్ లోక్‌సభ స్థానంతో పాటు హన్మకొండ, వర్ధన్నపేట అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి మూడు చోట్ల విజయం సాధించి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. జైలు నుంచే నామినేషన్ వేసిన రాఘవరావు ఘన విజయం అందుకున్నారు. 

వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో స్టేషన్ ఘన్‌పూర్, పాలకుర్తి, పరకాల, వర్ధన్నపేట, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిలో స్టేషన్ ఘన్‌పూర్, వర్ధన్నపేట స్థానాలు ఎస్సీ రిజర్వ్‌డ్. 2019 నాటికి వరంగల్ పార్లమెంట్ పరిధిలోని మొత్తం ఓటర్ల సంఖ్య 16,53,474 మంది. భూపాలపల్లి నియోజకవర్గం ఏ పార్టీ వైపు వుంటే .. ఆ పార్టీ అభ్యర్ధి వరంగల్‌ సీటును సొంతం చేసుకుంటూ వస్తున్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో సింగరేణి కార్మికుల కారణంగా వీరు అభ్యర్ధుల గెలుపొటములను ప్రభావితం చేస్తున్నారు. 

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్ ఆరు చోట్ల గెలవగా.. బీఆర్ఎస్ ఒక స్థానంతో సరిపెట్టుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధి పసునూరి దయాకర్‌కు 6,12,498 ఓట్లు.. కాంగ్రెస్ అభ్యర్ధి దొమ్మటి సాంబయ్యకు 2,62,200 ఓట్లు పోలయ్యాయి. మొత్తం బీఆర్ఎస్ 3,50,298 ఓట్ల భారీ మెజారిటీతో వరంగల్‌ను కైవసం చేసుకుంది. 

వరంగల్ ఎంపీ (పార్లమెంట్) ఎన్నికల ఫలితాలు 2024 .. బీఆర్ఎస్ కంచుకోట బద్ధలవుతుందా :

రాష్ట్రంలో అధికారాన్ని సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. వరంగల్‌ లోక్‌సభ స్థానాన్ని కాంగ్రెస్ గెలిచి 15 ఏళ్లు గడుస్తోంది. 2009లో చివరిసారిగా హస్తం పార్టీ ఇక్కడ విజయం సాధించింది. ప్రస్తుతం నియోజకవర్గంలో పార్టీ బలంగా వుండటంతో వరంగల్ ఎంపీ టికెట్ కోసం ఆశావహుల సంఖ్య భారీగా వుంది. ఈ టికెట్ కోసం దాదాపు 50 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎన్ఆర్ఐ నేత, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అమెరికా విభాగం అధ్యక్షుడు చింతా ప్రవీణ్ రేసులో ముందంజలో వున్నారు. ఆయనతో పాటు మల్లు రవి, సిరిసిల్ల రాజయ్య, దొమ్మటి సాంబయ్యలు కూడా ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు. 

బీఆర్ఎస్ విషయానికి వస్తే.. కంచుకోటను కోల్పోకూడదన్న ఉద్దేశంతో కేసీఆర్ పావులు కదుపుతున్నారు. సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్‌ మరోసారి బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, కడియం శ్రీహరి కుమార్తె కావ్య, పలువురు ఉద్యమకారులు వరంగల్ టికెట్ ఆశిస్తున్నారు. బీజేపీ కూడా వరంగల్‌పై కన్నేసింది. మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, మాజీ డీజీపీ కృష్ణ ప్రసాద్, చింతా సాంబమూర్తి తదితరులు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు.

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ కూడా వరంగల్ టికెట్ ఇస్తే బీజేపీలో చేరేందుకు సిద్ధంగా వున్నారు. మరోవైపు.. పొత్తులో భాగంగా వరంగల్ ఎంపీ టికెట్ తమకు కేటాయించాలని సీపీఐ కోరుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కమ్యూనిస్టులు బలంగానే వున్నారు. ఈ క్రమంలో సీనియర్ జర్నలిస్ట్ బీఆర్ లెనిన్‌కు టికెట్ కేటాయించాలనే డిమాండ్ వినిపిస్తోంది.  పాత్రికేయుడు కావడంతో అన్ని పార్టీలతో మంచి సంబంధాలే వున్నాయి. 
 

click me!