మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో డోర్నకల్, మహబూబాబాద్, నర్సంపేట, ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం అసెంబ్లీ నియోజవకర్గాలున్నాయి. మహబూబాబాద్, వరంగల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈ నియోజకవర్గం విస్తరించి వుంది. వీటిలో నర్సంపేట తప్పించి మిగిలిన 6 నియోజకవర్గాలు ఎస్టీ రిజర్వ్‌డ్. గిరిజనులు, ఆదివాసీలు , ఇతర దళిత జనాభా అధికంగా వున్న నియోజకవర్గం మహబూబాబాద్. వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు వున్నప్పటికీ.. రాజకీయ చైతన్యం మాత్రం ఇక్కడి వారిలో మెండు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో మహబూబాబాద్ పార్లమెంట్ టికెట్ కోసం ఆశావహుల జాబితా ఎక్కువైంది. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీకి కంచుకోటగా వున్న మహబూబాబాద్‌ను ఎట్టి పరిస్ధితుల్లో చేజార్చుకోకూడదని కేసీఆర్ కృతనిశ్చయంతో వున్నారు.
గిరిజనులు, ఆదివాసీలు , ఇతర దళిత జనాభా అధికంగా వున్న నియోజకవర్గం మహబూబాబాద్. వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు వున్నప్పటికీ.. రాజకీయ చైతన్యం మాత్రం ఇక్కడి వారిలో మెండు. విభిన్నమైన తీర్పు ఇవ్వడంలో మహబూబాబాద్ ఓటర్లు ముందుంటారు. విస్తారమైన అటవీ ప్రాంతం, విలువైన ఖనిజ సంపదకు నిలయం ఈ సెగ్మెంట్. 1957లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో తొలినాళ్లలో కాంగ్రెస్ పార్టీదే ఆధిపత్యం కాగా.. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ తన కంచుకోటగా మార్చుకుంది. 1957, 62, 65లలో కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్‌లో విజయం సాధించగా.. 1967 నుంచి 2008 వరకు ఆ నియోజకవర్గం రద్దయ్యింది. 2009లో తిరిగి పునరుద్ధరించగా.. కాంగ్రెస్ తరపున బలరాం నాయక్ గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. ఆ తర్వాత 2014, 19లలో బీఆర్ఎస్ పార్టీ మహబూబాబాద్‌లో విక్టరీ కొట్టింది.
మహబూబాబాద్ ఎంపీ (లోక్‌సభ) ఎన్నికల ఫలితాలు 2024 .. గిరిజనుల అడ్డా :
మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో డోర్నకల్, మహబూబాబాద్, నర్సంపేట, ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం అసెంబ్లీ నియోజవకర్గాలున్నాయి. మహబూబాబాద్, వరంగల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈ నియోజకవర్గం విస్తరించి వుంది. వీటిలో నర్సంపేట తప్పించి మిగిలిన 6 నియోజకవర్గాలు ఎస్టీ రిజర్వ్‌డ్. 2019 నాటికి మహబూబాబాద్ లోక్‌సభ పరిధిలో ఓటర్ల సంఖ్య 14,24,385 మంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 9,83,535 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
74.7 శాతం పోలింగ్ నమోదైంది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్ పరిధిలోని ఏడు శాసనసభ స్థానాల్లో 6 చోట్ల కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా.. ఒకచోట బీఆర్ఎస్ గెలిచింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధి మాలోత్ కవితకు 4,62,109 ఓట్లు.. కాంగ్రెస్ అభ్యర్ధి బలరాం నాయక్‌కు 3,15,446 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా బీఆర్ఎస్ అభ్యర్ధి 1,46,663 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో మహబూబాబాద్ పార్లమెంట్ టికెట్ కోసం ఆశావహుల జాబితా ఎక్కువైంది. నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ బలంగా వుండటంతో ఖచ్చితంగా గెలుస్తామన్న నమ్మకంతోనే నేతలు టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. 47 మంది ఈ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా.. వీరిలో బలరాం నాయక్‌నే టికెట్ వరించింది. గతంలో ఎంపీగా, కేంద్రమంత్రిగా చేసిన అనుభవం.. నియోజకవర్గంలో విస్త్రతంగా వున్న పరిచయాలు, కాంగ్రెస్ దూకుడు నేపథ్యంలో తన విజయం ఖాయమనే ధీమాలో బలరాం నాయక్ వున్నారు.
మహబూబాబాద్ ఎంపీ (పార్లమెంట్) ఎన్నికల ఫలితాలు 2024 .. మూడు పార్టీల్లోనూ బలమైన అభ్యర్ధులు :
బీఆర్ఎస్ విజయానికి వస్తే.. సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవితకు టికెట్ ఖరారు చేశారు పార్టీ అధినేత కేసీఆర్. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీకి కంచుకోటగా వున్న మహబూబాబాద్‌ను ఎట్టి పరిస్ధితుల్లో చేజార్చుకోకూడదని ఆయన కృతనిశ్చయంతో వున్నారు. కేసీఆర్ నాయకత్వం, బీఆర్ఎస్‌పై సానుభూతి, బలమైన కేడర్, కాంగ్రెస్ వైఫల్యాలతో తన విజయం ఖాయమని కవిత ధీమాగా వున్నారు. అటు బీజేపీ కూడా మహబూబాబాద్‌ను తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ సీతారాం నాయక్ బీజేపీలో చేరడంతో ఆ పార్టీకి బలమైన అభ్యర్ధి దొరికినట్లయ్యింది. మూడు పార్టీల్లోనూ హేమాహేమీలైన అభ్యర్ధులు కావడంతో విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.