బండి సంజయ్‌ బెయిల్ పిటిషన్ తిరస్కరణ: 14 రోజుల రిమాండ్ విధించిన కరీంనగర్ కోర్టు

By narsimha lodeFirst Published Jan 3, 2022, 2:44 PM IST
Highlights

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది కరీంనగర్ కోర్టు. 
 

కరీంనగర్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బెయిల్ పిటిషన్ ను  కరీంనగర్ కోర్టు సోమవారం నాడు తిరస్కరించింది. 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. BJP తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay సహా మరో నలుగురిని పోలీసులు జైలుకు తరలించనున్నారు.

ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీలకు సంబంధించి Telangana  రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 317 జీవో విషయమై ఉద్యోగ సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి.  317  జీవోను రద్దు చేయాలని కోరుతూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదివారం నాడు Karimnagar లో దీక్షకు దిగాడు. అయితే ఆదివారం నాడు రాత్రి బండి సంజయ్ దీక్షను police భగ్నం చేశారు. సంజయ్ ను పోలీసులు  ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు.

also read:వారి ఆదేశాల మేరకే... బిజెపి చీఫ్ బండి సంజయ్ పై నాన్ బెయిలబుల్ కేసులు: సిపి సత్యనారాయణ (Video)

మానకొండూరు పోలీస్ స్టేషన్ నుండి బండి సంజయ్ ను  కరీంనగర్ పీటీసీకి తరలించారు.ఈ విషయాన్ని తెలుసుకొన్న బీజేపీ కార్యకర్తలు ఇవాళ పెద్ద ఎత్తున కరీంనగర్ పీటీసీ సెంటర్ కు చేరుకొన్నారు. పీటీసీ సెంటర్ వద్ద బీజేపీ కార్యకర్తలు కరీంనగర్ సీపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సమయంలో  కొంత సేపు ఉద్రిక్తత నెలకొంది. Corona నిబంధనలు ఉన్న సమయంలో ఈ నిబంధనలు ఉల్లంఘించినందుకు కేసులు నమోదు చేసినట్టుగా కరీంనగర్ సీపీ సత్యనారాయణ చెప్పారు. బండి సంజయ్ దీక్ష ప్రాంగంణంలో మాస్క్ ధరించని 25 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. 

 సోమవారం నాడు కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ నుండి బండి సంజయ్  సహా మరో నలుగురిని పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. బండి సంజయ్ కు 14 రోజుల రిమాండ్  విధించింది కరీంనగర్ కోర్టు.  బండి సంజయ్ సహా మరో నలుగురిని  కరీంనగర్ జిల్లా జైలుకు తరలించనున్నారు పోలీసులు. అయితే బండి సంజయ్  సహా మరో నలుగురికి Bail కోసం న్యాయవాదులు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే బండి సంజయ్ బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది.

317 జీవోను సవరించడమో లేదా ఈ జీవోను రద్దు చేయడమో చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఉపాధ్యాయ సంఘాలు ఈ విషయమై  రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగాయి. గత మాసంలో తెలంగాణ సెక్రటేరియట్ ముట్టడికి ఉపాధ్యాయ సంఘాలు ప్రయత్నించాయి. అయితే ఉపాధ్యాయ సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. 317 జీవో విషయంలో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

ఈ జీవో ద్వారా బదిలీలు కొనసాగితే  స్థానికతతో పాటు సీనియారిటీ విషయంలో కూడా ఇబ్బందులు చోటు చేసుకొనే అవకాశం ఉందని ఉపాధ్యాయ సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. ఈ జీవో కారణంగా 25 వేల మంది ఉపాధ్యాయులు స్థానికతను కోల్పోయారని కూడా ఉపాధ్యాయ సంఘాల నేతలు గుర్తు చేస్తున్నారు.

 

click me!