ఆదిలాబాద్ జిల్లాలో ఉద్రిక్తత.. విద్యార్థి సంఘాల నాయకులపై పోలీసుల లాఠీచార్జ్

Published : Jan 03, 2022, 12:45 PM ISTUpdated : Jan 03, 2022, 12:59 PM IST
ఆదిలాబాద్ జిల్లాలో ఉద్రిక్తత.. విద్యార్థి సంఘాల నాయకులపై పోలీసుల లాఠీచార్జ్

సారాంశం

ఆదిలాబాద్‌ జిల్లాలో (adilabad district) తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. జిల్లాలో గిరిజిన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాలు నిరసన తెలియజేశారు. ఈ క్రమంలోనే ఉద్రిక్తత తెలియజేశారు.

ఆదిలాబాద్‌ జిల్లాలో (adilabad district) తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. జిల్లాలో గిరిజిన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాలు నిరసన తెలియజేశారు. ఇందుకు సంబంధించి.. అధికారులు, ప్రజా ప్రతినిధులను ఎన్నిసార్లు కోరిన ఫలితం లేదని విద్యార్థి సంఘాలు (students union) ఆరోపించారు. ఈ క్రమంలోనే కలెక్టర్ వాహనాన్ని విద్యార్థి సంఘాలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు విద్యార్థి నాయకులపై లాఠీచార్జ్ (lathi charge) చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో విద్యార్థి సంఘం నాయకులు రోడ్లపై పరుగులు తీశారు. ఈ క్రమంలోనే కొందరు విద్యార్థి సంఘాల నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి తరలించారు.


 

PREV
click me!

Recommended Stories

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలతో హై అలర్ట్.. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్
తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరిక రానున్న 24 గంటల్లో | Heavy Rain Alert for AP & Telangana