కౌషిక్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా : భట్టి విక్రమార్క

By AN TeluguFirst Published Jul 13, 2021, 3:33 PM IST
Highlights

రేవంత్ రెడ్డితో పాటు, తెలంగాణ ఇన్ చార్జి జనరల్ సెక్రెటరీ మాణిక్యం ఠాగూర్ పై డబ్బులు అభియోగాన్ని కూడా ఆయన  తీవ్రంగా ఖండించారు. ఇన్ ఛార్జి - జనరల్ సెక్రెటరీగామాణిక్యం ఠాగూర్ తనపని తాను చేశారన్నారు.

హైదరాబాద్ : టీపీసీసీ అధ్యక్షులు ఏ. రేవంత్ రెడ్డి మీద పాడి కౌషిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ వాదులెవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయరన్నారు.  కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని, విధానాలను, అమలు జేయడం కోసం అందరూ ముందుండి.. నడిపించాలన్నారు.  

తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా సోనియాగాంధీ తీసుకున్న నిర్ణయాన్ని క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు, పార్టీ నాయకులు అందరూ తప్పనిసరిగా ఆమోదించాలని, సోనియాగాంధీ గారి నిర్ణయాన్ని అందరూ అమలు పరచాలని ఆయన అన్నారు. 

రేవంత్ రెడ్డితో పాటు, తెలంగాణ ఇన్ చార్జి జనరల్ సెక్రెటరీ మాణిక్యం ఠాగూర్ పై డబ్బులు అభియోగాన్ని కూడా ఆయన  తీవ్రంగా ఖండించారు. ఇన్ ఛార్జి - జనరల్ సెక్రెటరీగామాణిక్యం ఠాగూర్ తనపని తాను చేశారన్నారు.

అభాండాలు మొత్తం పార్టీకి నష్టం కలిగిస్తాయని, గత ఎన్నికల్లో హుజూరాబాద్ శాసనసభలో కౌషిక్ రెడ్డికి వచ్చిన 61,121 ఓట్లన్నీ.. కాంగ్రెస్ ఓట్లే అన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. 

రేపు హుజూరాబాద్ కు జరిగే ఉప ఎన్నికలో కూడా టీఆర్ఎస్-బీజేపీల మధ్య ఓట్లు చీలినా.. స్థిరమైన ఓట్ బ్యాంక్ తో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదని అన్నారు. 
 

click me!