కేసీఆర్ సొంత జిల్లా దుబ్బాకలో తెరాసకు బిగ్ షాక్...

Published : Jul 13, 2021, 02:53 PM IST
కేసీఆర్ సొంత జిల్లా దుబ్బాకలో తెరాసకు బిగ్ షాక్...

సారాంశం

దుబ్బాకలో  ముగ్గురు అధికార తెరాస కౌన్సిలర్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో బీజేపీ లో చేరారు. 

హైదరాబాద్ :  దుబ్బాక మున్సిపాలిటీ లో ముగ్గురు సిట్టింగ్ తెరాస కౌన్సిలర్లను బీజేపీలో చేర్చి అధికార పార్టీ ని కోలుకోలేని దెబ్బ కొట్టాడు ఎమ్మెల్యే రఘునందన్ రావు. 

దుబ్బాకలో  ముగ్గురు అధికార తెరాస కౌన్సిలర్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో బీజేపీ లో చేరారు. ఎమ్మెల్యే రఘునందన్ నేతృత్వంలో దుబ్బాకలో అభివృద్ధి కోసం కృషి చేస్తామని, తెరాస దుబ్బాకను కావాలని టార్గెట్ చేయడం తగదని వారన్నారు. 

కౌన్సిలర్లు  మట్ట మల్లారెడ్డి - 3 వార్డు, దివిటి కనకయ్య - 7 వ వార్డు, దుబ్బాక బాలకృష్ణ గౌడ్ - 8 వ వార్డు   నుంచి బీజేపీ లో చేరారు. దుబ్బాక నే కాదు తెలంగాణ సమాజం మొత్తం కూడా బీజేపీ వైపు చూస్తోందన్నారు.

దుబ్బాక ద్వారా దానికి నాంది పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.  తెరాస కౌన్సిలర్లకు బండి సంజయ్ కండువా కప్పి బీజేపీలోకి స్వాగతం పలికారు.

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు