యాంకర్ శ్యామల భర్త సహా మరో మహిళ అరెస్టు

Published : Apr 27, 2021, 02:05 PM IST
యాంకర్ శ్యామల భర్త సహా మరో మహిళ అరెస్టు

సారాంశం

యాంకర్ శ్యామల భర్త నర్సింహా రెడ్డితో పాటు మరో మహిళను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి వారిద్దరిని రిమాండ్ కు తరలించారు.

హైదరాబాద్: యాంకర్ శ్యామల భర్తను హైదరాబాదులోని రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. శ్యామల భర్త నర్సింహా రెడ్డితో పాటు మరో మహిళను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో వారిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. 

తన వద్ద కోటి రూపాయలు తీసుకుని ఇవ్వడం లేనది ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2017 నుంచి విడతలవారీగా నర్సింహా రెడ్డి డబ్బులు తీసుకున్నాడని, వాటిని తిరిగి ఇవ్వాలని అడిగితే బెదిరిస్తున్నాడని ఆమె ఆరోపించింది. 

ఆ వివాదంలో మరో మహిళ రంగంలోకి దిగింది. నర్సింహారెడ్డి సెటిల్మెంట్ చేసుకోవాలంటూ ఓ మహిళ రాయబారం నడిపిందని బాధిత మహిళ ఫిర్యాదు చేసింది.  డబ్బులు తీసుకోవడంతో పాటు తనను లైంగికంగా కూడా వేధించాడని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

PREV
click me!

Recommended Stories

Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. కుండపోత వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ బిగ్ అలర్ట్
Konda Surekha: పదవి పోయిందని ఇంట్లో కూర్చోం.. కొండా సురేఖ కీల‌క వ్యాఖ్య‌లు