వణికిపోతున్న రెవెన్యూ ఉద్యోగులు: కామారెడ్డి ఆర్డీవోకు బెదిరింపులు

By narsimha lodeFirst Published Nov 7, 2019, 12:09 PM IST
Highlights

కామారెడ్డి ఆర్డీఓ రాజేంద్రకుమార్ కు గుర్తు తెలియని వ్యక్తి గురువారం నాడు ఫోన్ చేసి బెదిరించాడు. ఎమ్మార్వో విజయా రెడ్డికి పట్టిన గతే మీకు పడుతోందని హెచ్చరించాడు.

కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కామారెడ్డి ఆర్డీఓకు పట్టాదారు పాస్‌ పుస్తకాలు ఇవ్వాలని గురువారం నాడు ఓ బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వకపోతే  అబ్దుల్లాపూర్‌మెట్టు ఎమ్మార్వో కి పట్టిన గతే పడుతోందని హెచ్చరించాడు ఆగంతకుడు. దీంతో ఆర్డీఓ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 AlsoRead Tahsildar vijayareddy: నా భర్త అమాయకుడు.. నిందితుడు సురేష్ భార్య

అబ్దుల్లాపూర్‌మెట్టు ఎమ్మార్వో   సజీవ దహనం ఘటన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో రెవిన్యూ అధికారులు భయంతో వణికిపోతున్నారు.తమ పనులు కాకపోతే విజయారెడ్డికి పట్టిన గతేపడుతోందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చస్తాం లేదా చంపుతాం అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు.

AlsoRead ఎమ్మార్వో విజయారెడ్డి ఇంటికి సురేష్: భర్త సుభాష్ రెడ్డితో భేటీ, అందుకోసమేనా?...

ఇదే తరహా ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకొంది. కామారెడ్డి ఆర్డీఓ రాజేంద్ర కుమార్ కు కూడ ఇదే తరహాలో బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. విజయారెడ్డికి పట్టిన గతే మీకు పడుతోందని హెచ్చరించాడు.

దీంతో భయపడిన  ఆర్డీఓ రాజేంద్రకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు పాస్ పుస్తకాలను ఇవ్వాలని నిందితుడు హెచ్చరించినట్టుగా ఆర్డీఓ పోలీసులకు పిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుపై పోలీసులు విచారణ ప్రారంభించారు. 

AlsoRead విజయారెడ్డి హత్య వెనుక టీఆర్ఎస్: కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

అయితే ఈ ఫోన్ చేసింది ఓ ఏఆర్ కానిస్టేబుల్‌ గా పోలీసులు గుర్తించినట్టుగా సమాచారం.దీంతో ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారంటున్నారు. అయితే ఈ ఫోన్ చేసింది ఏఆర్ కానిస్టేబులేనా, ఆ ఫోన్‌ను ఉపయోగించి మరేవరైనా ఈ ఫోన్ చేశారా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఈ నెల 4వ తేదీన అబ్దుల్లాపూర్‌ ‌మెట్టు ఎమ్మార్వో విజయా రెడ్డిని సురేష్ ఎమ్మార్వో కార్యాలయంలోనే సజీవ దహనం చేశాడు. ఎమ్మార్వో విజయా రెడ్డిని సజీవ దహనం చేసే సమయంలో  సురేష్ కూడ గాయపడ్డాడు.ఉస్మానియాఆసుపత్రిలో చికిత్స పొందుతూ సురేష్  గురువారం నాడు మృతి చెందాడు.

అబ్దుల్లాపూర్‌ మెట్టు ఎమ్మార్వో విజయా రెడ్డి సజీవ దహనం తర్వాత  కర్నూల్ జిల్లా పత్తికొండకు చెందిన ఎమ్మార్వో ఉమా మహేశ్వరీ తన చాంబర్‌లో తాడును అడ్డంగా కట్టారు. ఈ తాడును దాటి ఎవరిని కూడ లోనికి అనుమతించడం లేదు.ఆర్టీలు ఇచ్చేందుకు వచ్చేవారంతా తాడుకు అవతలివైపు మాత్రమే ఉండాలని తే్చి చెప్పారు. సిబ్బందిని మాత్రమే తాడు లోపలికి అనుమతిస్తున్నారు. 

 

click me!