హీరో రజినీకాంత్ ని కలిసి తెలంగాణ ఎమ్మెల్యే

Published : Nov 07, 2019, 10:08 AM IST
హీరో రజినీకాంత్ ని కలిసి తెలంగాణ ఎమ్మెల్యే

సారాంశం

అనంతరం రజనీ ఆశీర్వాదం తీసుకున్నారు. ఎన్నుకున్న ప్రజలకు సేవచేయాలని రోహిత్‌రెడ్డికి రజినీ సూచించారని తెలిపారు. ఈ భేటీ తమ వ్యక్తిగతమని అన్నారు. సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌కు కోట్లలో అభిమానులు ఉన్నారన్నారు.   

సూపర్ స్టార్ రజీనీకాంత్ ని తెలంగాణ ఎమ్మెల్యే ఒకరు కలిశారు. తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బుధవారం చెన్నైలోని రజినీకాంత్ నివాసానికి వెళ్లారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి... తన భార్య ఆర్తి రెడ్డి తో వెళ్లి మరీ ఆయనను కలిసి పుష్పగుచ్చం అందజేశారు.

అనంతరం రజనీ ఆశీర్వాదం తీసుకున్నారు. ఎన్నుకున్న ప్రజలకు సేవచేయాలని రోహిత్‌రెడ్డికి రజినీ సూచించారని తెలిపారు. ఈ భేటీ తమ వ్యక్తిగతమని అన్నారు. సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌కు కోట్లలో అభిమానులు ఉన్నారన్నారు. 

కాగా, గతేడాది డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి గెలుపొందిన రోహిత్‌రెడ్డి, ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే. గతంలో కూడా రోహిత్‌రెడ్డి పలుమార్లు రజనీకాంత్‌ను కలిశారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?