
హైదరాబాద్‌లో కామారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్‌కు గురయ్యారు. బాధితులు కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకుని కామారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. కామారెడ్డి జిల్లాకు చెందిన జావేద్, సుమేర్‌లను హైదరాబాద్‌లోని రామంతపూర్ పరిధిలో కిడ్నాప్‌కు గురయ్యారు. జావేద్, సుమేర్‌ల స్నేహితుడైన లుక్మాన్ డబ్బులు తీసుకుని పారిపోయాడని.. కిడ్నాపర్లు వారిని కిడ్నాప్ చేశారు. అయితే కిడ్నాపర్ల చెర నుంచి బయటపడ్డ వారు.. కామారెడ్డికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read: వర్షాలు కురుస్తాయి, అగ్నిప్రమాదాలు జరుగుతాయి.. : భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత
కిడ్నాపర్లు తమను హైదరాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో ఉంచి చిత్రహింసలకు గురిచేశారని బాధితులు ఆరోపించారు. ఎలాగోలా వారి నుంచి తప్పించుకుని కామారెడ్డికి చేరుకున్నట్టుగా బాధితులు తెలిపారు.
Also Read: ఉత్తరాదిని వణికిస్తున్న భారీ వర్షాలు.. 19 మంది దుర్మరణం.. పలుచోట్ల కొట్టుకుపోయిన రోడ్లు, వాహనాలు..