ఈడీ రిప్లై తర్వాత ఢిల్లీ పర్యటనపై కవిత నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
హైదరాబాద్: ఈడీ స్పందన చూసిన తర్వాత ఢిల్లీకి వెళ్లే విషయమై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారంగా ఇవాళ సాయంత్రం కవిత ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. రేపు విచారణకు రావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఈ విషయమై కవిత స్పందించారు. రేపు విచారణకు రాలేనని కవిత ఈడీ అధికారులకు సమాచారం ఇచ్చారు ఈ నెల 15వ తేదీ తర్వాత విచారణకు హాజరు కానున్నట్టుగా ఈడీకి లేఖ రాశారు. ఈ లేఖపై ఈడీ అధికారుల స్పందన కోసం కవిత వేచి చూస్తున్నారు.
రేపు విచారణకు రావాలని ఈడీ అధికారులు కచ్చితంగా కోరితే ఏం చేయాలనే దానిపై న్యాయ సలహలు తీసుకుంటున్నారు కవిత. తాను కోరినట్టుగా ఈడీ అధికారులు విచారణ విషయంలో మరో తేదిని ఇస్తే ఇబ్బంది లేదు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం విషయమై విచారణ అధికారులకు ఏ రకమైన సమాధానాలు చెప్పాలనే దానిపై కూడా ఆమె కేసీఆర్ తో చర్చించనున్నారు. ఇవాళ సాయంత్రం ఆమె ప్రగతి భవన్ లో కేసీఆర్ తో సమావేశం కానున్నారు.
undefined
ఈడీ అధికారుల నిర్ణయం మేరకు కవిత ఢిల్లీ పర్యటన ఉంటుంది. మహిళా రిజర్వేషన్ బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశ పెట్టాలని భారత జాగృతి సమితి ఆధ్వర్యంలో దీక్ష ఏర్పాటు చేసింది. ఈ నెల 10వ తేదీన ఈ దీక్షను ఏర్పాటు చేసింది కవిత. పలు పార్టీలకు చెందిన నేతలు ఈ దీక్షలో పాల్గొంటారు.
also read:కవిత తెలంగాణ తలదించుకునేలా చేసింది.. బతుకమ్మ ముసుగులో లిక్కర్ స్కామ్: వైఎస్ షర్మిల
ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిన్న అరుణ్ రామచంద్రపిళ్లై ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అరుణ్ రామచంద్రపిళ్లై రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను ఈడీ ప్రస్తావించారు.కవితకు తాను ప్రతినిధిగా వ్యవహరించినట్టుగా అరుణ్ రామచంద్రపిళ్లై విచారణలో ఒప్పుకున్నారని ఈ రిమాండ్ రిపోర్టు చెబుతుంది.